ఐదువేలమంది కళాకారులకు అండగా...
close
Updated : 20/03/2021 06:21 IST

ఐదువేలమంది కళాకారులకు అండగా...

జానపద గీతాలకుండే ఆదరణే వేరు... ఇవి వినేవారి నాలుకల మీదే నాట్యమాడతాయి. కానీ ఈ కళాకారుల అవగాహనాలేమితో ఎన్నో మధురమైన గీతాలు కనుమరుగువుతున్నాయి కూడా. అందుకే వీరికి అండగా నిలుస్తోంది ‘అనహద్‌ ఫౌండేషన్‌.’
అమూల్యమైన భారతీయ వారసత్వ సంపదలో జానపద కళలు, సంగీతం అంతర్భాగం కూడా. అలాంటి కళలను తిరిగి వెలుగులోకి తీసుకురావడానికి దిల్లీకి చెందిన ‘అనహద్‌ ఫౌండేషన్‌’ కృషి చేస్తోంది. ఎనిమిదేళ్ల కిందట సుచిరాయ్‌, అభినవ్‌ దీన్ని ప్రారంభించారు. ఐదువేలమంది కళాకారులు దీంట్లో సభ్యులు.

కళాకారుల సాధికారత కోసం...
జానపద కళాకారులకు ఆ గీతాల పరిరక్షణకు సంబంధించి సరైన అవగాహన ఉండదు. వీరిలో ఎక్కువమంది నిరక్షరాస్యులు కావడం వల్ల పాటలను వీడియో రూపంలో భద్రపరిచే సాంకేతికతా వీరికి అందుబాటులో ఉండదు. వీరి గీతాలను ఎవరైనా యథాతథంగా తీసుకుని వినియోగించినా ప్రశ్నించే నైజమూ ఉండదు. అలాకాకుండా వీరికి అన్ని విధాల సాయపడుతూ సాధికారతనూ చేకూరుస్తోందీ సంస్థ. వీరి మేధోసంపత్తి, కాపీరైట్లకు సంబంధించిన విషయాల్లో పూర్తి జాగ్రత్తలు తీసుకుంటుంది సుచిరాయ్‌. లాయరైన ఈమెకు జానపదాలంటే ఎంతో ఇష్టం. ఐదేళ్ల వయసులోనే హిందుస్థానీ సంగీతం, తబలా నేర్చుకుంది. మాస్టార్లకు అప్పట్లో వారి పాఠాలను రికార్డు చేసుకునే సదుపాయం కూడా ఉండేది కాదు. ఈ విషయాన్ని గమనించిన సుచి లా మూడో ఏడాది చదువుతుండగానే స్నేహితుడు అభినవ్‌ అగర్వాల్‌తో కలిసి ఈ సంస్థను ప్రారంభించింది. చదువు పూర్తయిన తర్వాత సుప్రీంకోర్టు లాయర్‌గా కొంతకాలంపాటు పనిచేసింది. ఆ తర్వాత అభినవ్‌నే పెళ్లిచేసుకుని సంస్థకు పూర్తిస్థాయిలో తన సేవలను అందిస్తోంది. ‘ప్రత్యేకంగా ఒక ప్రాంతాన్ని ఎంపికచేసుకుని అక్కడి జానపద కళాకారులను గుర్తిస్తాం. వారికి అవసరమైన శిక్షణ, వాద్య పరికరాలను సమకూర్చి పాటలను రికార్డు చేస్తాం. మా వెబ్‌సైట్‌లో కళాకారుల వివరాలను ఫోన్‌ నంబర్లతోపాటు అందుబాటులో ఉంచుతాం. అవసరమైన వాళ్లు మధ్యవర్తులతో పనిలేకుండా నేరుగా వీళ్లను సంప్రదించవచ్చు. లాక్‌డౌన్‌ సమయంలో సుమారు రూ.85 లక్షలను సేకరించి ఐదువేలమంది కళాకారులకు ఆర్థిక సాయం అందించాం. పది రాష్ట్రాల్లోని 78 కేంద్రాల ద్వారా కళాకారులను ఎంపికచేసి ఆర్థిక సాయం చేశాం. మా వెబ్‌సైట్‌, బిజినెస్‌ కార్ట్‌ ద్వారా ఎంతోమంది కళాకారులు జాతీయ, అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శనలు ఇచ్చే అవకాశాన్ని పొందారు’ అంటోంది సుచి.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి