సన్‌స్క్రీన్‌ ఎలా వాడాలంటే!
close
Updated : 21/03/2021 04:44 IST

సన్‌స్క్రీన్‌ ఎలా వాడాలంటే!

ఎండ, వాతావరణం నుంచి చర్మాన్ని కాపాడుకోవాలంటే సన్‌స్క్రీన్‌ రాసుకుంటాం... అయితే ఎలాంటిదాన్ని ఎంచుకోవాలి? అప్లై చేసుకునే విధానంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో చూద్దాం!
* అరగంట ముందుగానే... బయటకు వెళ్లడానికి అరగంట ముందే దీన్ని అప్లై చేసుకోవాలి. ఎందుకంటే చర్మంలో ఈ క్రీమ్‌ ఇంకిపోవడానికి  దాదాపు 30 నిమిషాల సమయం పడుతుంది.
* రెండు గంటలకోసారి... ప్రతి రెండు గంటలకోసారి దీన్ని రాసుకుంటేనే ఫలితం ఉంటుంది.  ఇదొక్కటే సూర్యకిరణాల నుంచి రక్షణ ఇవ్వదు. దీంతోపాటు ఎస్‌పీఎఫ్‌ 30 ఉండే లిప్‌ బామ్‌, పెద్ద టోపీ, కళ్లద్దాలు, శరీరాన్ని పూర్తిగా కప్పేలా దుస్తులను ధరించాలి. ఉదయం పది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బయటకు తగిన జాగ్రత్తలతో వెళ్లాలి.
* యూవీఏ నుంచి రక్షణగా.... అల్ట్రావయెలెట్‌-బి కిరణాల వల్ల చర్మం పాడవుతుంది. అదేవిధంగా అల్ట్రావయెలెట్‌-ఎ కిరణాల వల్ల చర్మ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వీటి నుంచి రక్షణనిచ్చే సన్‌స్క్రీన్‌ను ఎంచుకోవాలి.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని