నాకు పిల్లలు పుట్టరా ?
close
Updated : 21/03/2021 05:55 IST

నాకు పిల్లలు పుట్టరా ?

నా వయసు 25 ఏళ్లు. వివాహమై మూడేళ్లు అవుతోంది. పెళ్లైన మొదటి ఏడాదిలోనే ప్రెగ్నెన్సీ వచ్చింది. అయితే పదిరోజులకే అబార్షన్‌ అయ్యింది. ఆ తర్వాత పరీక్షల్లో నాకు థైరాయిడ్‌, పీసీఓఎస్‌ ఉన్నాయని తెలిసింది. అప్పటి నుంచి పీరియడ్స్‌ సరిగా రావడం లేదు. రెండేళ్లుగా మందులు వాడుతున్నా. గర్భాశయంలో అండం తయారు కావడం లేదని చెబుతున్నారు వైద్యులు.  నాకు సంతానం కలగదా?

- ఓ సోదరి

మీరు ‘సంతానం కలగదేమో’నని ఆవేదన చెందాల్సిన అవసరం లేదు. అయితే అండం తయారీ, విడుదలకు చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది మీరు తీసుకుంటున్నారని తెలుస్తోంది.  పీసీఓఎస్‌, థైరాయిడ్‌ సమస్యల వల్ల బరువు పెరిగినట్లయితే  ఆరోగ్యకరమైన విధానాల్లో తగ్గండి. ఒక పక్క సంతానం కోసం చికిత్స తీసుకుంటూనే మరోపక్క  మీ బరువులో కనీసం పది శాతమైనా తగ్గేందుకు ప్రయత్నించండి. ఒకవేళ మీకు ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ ఉంటే.. దాన్ని తగ్గించుకోవడానికి ఇన్సులిన్‌ సెన్సిటైజర్స్‌ వాడాలి. అప్పుడే అండం విడుదలకు ఉన్న కొన్ని అవాంతరాలు తొలగిపోతాయి. అండం ఉత్పత్తికి వాడే మందుల్లో చాలా రకాలుంటాయి. ముందుగా మాత్రలు, అవసరమనుకుంటే ఇంజెక్షన్స్‌ ఇవ్వాల్సి ఉంటుంది. వీటన్నింటి వల్ల కూడా అండం తయారీ, విడుదల కావడం లేదంటే...  గర్భం రాకపోవడానికి మరే ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనేది తెలుసుకోవాలి. ఇందుకోసం హిస్టరోస్కోపీ, ల్యాపరోస్కోపీ చేయించుకోవాలి. అవసర మనుకుంటే ‘ల్యాపరోస్కోపీ ఓవేరియన్‌ డ్రిల్లింగ్‌’ చేయాల్సి వస్తుంది. దాంతోపాటు జీవనవిధానంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. క్రమంతప్పకుండా వ్యాయామం చేయడం, డైట్‌లో మార్పులు, బరువు తగ్గేందుకు ప్రయత్నించడం, ఒత్తిడిని తగ్గించుకోవడం లాంటివి చేస్తే  మంచి ఫలితాలుంటాయి. మీరు అమ్మ అయ్యే అవకాశాలు తప్పకుండా ఉంటాయి. కాబట్టి బాధపడకుండా గైనకాలజిస్ట్‌ను కలవండి.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి