మెరిసే దంతాల కోసం...
close
Updated : 21/03/2021 05:25 IST

మెరిసే దంతాల కోసం...

అందమైన చిరునవ్వు.. చక్కటి పలువరుస.. ఆరోగ్యమైన చిగుళ్లు కావాలంటే... కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే...
రోజుకు రెండుసార్లు... చాలామంది కేవలం ఉదయం మాత్రమే దంతాలను శుభ్రం చేసుకుంటారు. రాత్రి నిద్రపోయే ముందు చేసుకోరు. దీంతో మనం తిన్న ఆహారం పళ్లపై పేరుకుపోయి దంతక్షయానికి కారణమవుతుంది. కాబట్టి రోజూ రాత్రి పడుకోబోయే ముందు, ఉదయం లేచిన వెంటనే. పళ్లను శుభ్రం చేసుకోవాలి. అలాగే మృదువైన బ్రిసిల్స్‌ ఉన్న బ్రష్‌ను ఎంచుకోవాలి. దీంతో తోముకుంటే దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
ఫ్లాసింగ్‌ తప్పనిసరి.... వారంలో ఒకట్రెండుసార్లు కచ్చితంగా ఫ్లాసింగ్‌ చేసుకోవాలి. దీనివల్ల దంతాల మధ్య ఇరుక్కుపోయిన వ్యర్థాలు, మురికి తొలగిపోయి, పళ్లు ఎక్కువ కాలంపాటు శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంటాయి.
చిగుళ్లకు మర్దన... యూకలిప్టస్‌, పెప్పర్‌మెంట్‌, వేప నూనెల్లో దేంతోనైనా చిగుళ్లపై మృదువుగా కాసేపు రుద్దాలి. ఈ నూనెల్లోని యాంటీబ్యాక్టీరియల్‌, యాంటీవైరల్‌ సమ్మేళనాలు చిగుళ్లను ఆరోగ్యంగా, రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తాయి.  
పుక్కిలించడం మంచిదే... మార్కెట్‌లో రకరకాల మౌత్‌వాష్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటి ఖరీదు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంట్లోనే మీరు సులువుగా సహజసిద్ధంగా తయారుచేసుకోవచ్చు. గ్లాసు గోరువెచ్చటి నీటిలో పావు చెంచా ఉప్పు, చిటికెడు వంటసోడా వేసుకుని ఆ నీటితో పుక్కిలించాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే నోట్లోని హానికారక సూక్ష్మజీవులు చనిపోయి, దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
మెల్లిగా తినాలి.. ఎల్లప్పుడూ తాజా, మృదువైన ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే మెల్లిగా, బాగా నమలి తినాలి.
ఆర్నెళ్లకోసారి... సాధారణంగా మనం దంతాలకు సంబంధించి సమస్య వచ్చినప్పుడు మాత్రమే వైద్యుడిని సంప్రదిస్తాం. ఇది సరైన పద్ధతి కాదు. ఆర్నెళ్లకోసారి తప్పనిసరిగా దంత పరీక్షలు చేయించుకోవాలి. ఇలా చేస్తే ఏదైనా సమస్య ఉన్నా దాన్ని మొదట్లోనే గుర్తించే వీలుంటుంది.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి