కాగితంతో అద్భుతాలు!  
close
Published : 21/03/2021 02:02 IST

కాగితంతో అద్భుతాలు! 

ప్రకృతి దృశ్యం...ఎగిరే డేగ...దేవతామూర్తుల ఫొటోలు... వీటిలో ఏది కనిపించినా పేపర్‌ క్విల్లింగ్‌ విధానంలో అద్భుతమైన కళాఖండంగా తయారుచేయగలదీమె. ప్రేమికులు, దంపతుల ఫొటో ఇస్తే వారిని క్విల్లింగ్‌తో అందమైన ఫ్రేమ్‌గా మార్చేయగలదు. వికలాంగురాలైనా... నిరాశ చెందకుండా... తన లోని సృజనాత్మకతతో కళాకృతులను రూపొందిస్తోంది. అతి తక్కువ సమయంలో వాణిజ్యవేత్తగా మారి ప్రశంసలనే కాదు... మరెందరికో స్ఫూర్తిగానూ నిలుస్తోంది 43 ఏళ్ల గుణవతి చంద్రశేఖరన్‌.
దిండిగల్లు జిల్లాలోని చిన్నలపట్టి గ్రామంలో ఓ ఉన్నతవిద్యావంతుల కుటుంబంలో గుణవతి పుట్టింది. ఇంట్లో తండ్రి, సోదరుడు, వదిన అందరూ వైద్యరంగంలో స్థిరపడినవారే. గుణవతి రెండేళ్ల వయసులో పోలియోకు గురైంది. క్రమేపీ ఒక కాలు పూర్తిగా ఎదగకుండా ఉండిపోయింది. తోడు లేకపోతే కనీసం 20 అడుగులు కూడా వేయలేని స్థితికి చేరుకుంది. తల్లిదండ్రులు చంద్రశేఖరన్‌తో వివాహం చేశారు. చిన్నప్పటి నుంచి చిత్రలేఖనాలు గీయడం, చేతికి దొరికిన వస్తువులను అందమైన బొమ్మలుగా మార్చడంలో గుణవతి తన సృజనాత్మకతను ప్రదర్శించేది. తనకిష్టమైన కళలోనే ఏదైనా సాధించాలనుకుంది. అలా మొదలైందే పేపర్‌ క్విల్లింగ్‌తో కళాకృతులు చేయడం. స్వీయ శిక్షణతో పలు ప్రయోగాలు చేపట్టింది. మొత్తానికి తాననుకున్న కళాత్మకతను కాగితం క్విల్లింగ్‌తో సాధించింది. వాల్‌ఆర్ట్స్‌, గ్రీటిం, వెడ్డింగ్‌ కార్డులు, మినియేచర్స్‌, పలు సంస్థలకు లోగోలు, నేమ్‌ బోర్డులు, ఆభరణాలు వంటివి రూపొందించేది.

బ్రిటిష్‌ కౌన్సిల్‌ వర్క్‌షాపులో...
ఆన్‌లైన్‌లో ఉంచిన ఈ కళాకృతులకు అభిమానులే కాదు, కొనుగోలుదారులూ పెరిగారు. ఆర్డర్లకు తగ్గట్లు అందించడానికి చిన్న పరిశ్రమను స్థాపించి, అందులో నిరుపేద మహిళలను చేర్చుకుంది. వారికి శిక్షణనిచ్చింది. ఈ కళకు గుర్తింపుగా లండన్‌ క్విల్లింగ్‌ గిల్డ్‌లో సభ్యురాలైంది. ఆరేళ్లక్రితం బ్రిటిష్‌ కౌన్సిల్‌ వర్క్‌షాపులో పాల్గొనే అర్హతను సాధించి, విదేశీయులకు సైతం వీటి తయారీలో శిక్షణనందించా అంటారీమె.‘అతి తక్కువ సమయంలోనే ప్రముఖ వ్యాపారవేత్తగా ఎలా ఎదిగాను’ అనే దానిపై ప్రసంగించి ప్రశంసలు అందుకున్నా. ఫొటో ఇస్తే దాన్ని పేపర్‌ క్విల్లింగ్‌తో అందమైన ఫ్రేంగా మార్చేస్తా. స్ఫూర్తి ప్రసంగాలు చేయడానికి విద్యాసంస్థలు, కార్పొరేట్‌ కంపెనీలు, ఆసుపత్రులు నన్ను ఆహ్వానిస్తున్నాయి. ఈ కళను మరికొందరికి ఉచితంగా నేర్పిస్తున్నా. అనాధాశ్రమాలు, ప్రభుత్వపాఠశాలల చిన్నారులకు ఇందులో పాఠాలు చెబుతున్నా. ‘వుమెన్‌ ఆఫ్‌ ఎక్సెలెన్స్‌’,  ‘ఉత్తమ వాణిజ్యవేత్త’,  ‘వుమెన్‌ ఆఫ్‌ ఎంపవర్‌మెంట్‌’ అవార్డులు అందుకున్నా. మా గ్రామమహిళలందరికీ స్వయం ఉపాధిని కల్పించడానికి ప్రయత్నిస్తున్నా’ అని అంటుందీమె.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి