మొలకలు మేలు చేస్తాయి!
close
Published : 23/03/2021 01:11 IST

మొలకలు మేలు చేస్తాయి!

శరీరానికి సరైన పోషకాలు అందకపోతే ఎన్నో అనారోగ్యాలు చుట్టుముడతాయి. అలాకాకుండా ఉండాలంటే తృణధాన్యాలతో చేసిన మొలకలు తినాలి.
రోజుల్లో టీనేజీ నుంచే అమ్మాయిలు హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత వంటివి ఎదుర్కొంటున్నారు.  మొలకల్లోని  జింక్‌, ఇనుము, క్యాల్షియం ఎక్కువగా లభిస్తాయి.వీరు రోజూ ఓ కప్పు తీసుకుంటే పై సమస్యలు పరిష్కారం కావడంతో పాటు వ్యాధినిరోధక శక్తిని పెంచే విటమిన్‌ సి పుష్కలంగా దొరుకుతుంది.  
* మెదడుకు రక్తం చక్కగా సరఫరా చేయడంలోనూ మొలకల్లోని పోషకాలు కీలకపాత్ర పోషిస్తాయి. మానసిక ఒత్తిడీ అదుపులో ఉంటుంది. ముఖ్యంగా ప్రొటీన్లు బీన్స్‌, నట్స్‌, గింజల్లో ఎక్కువ దొరుకుతాయి. వీటిని మొలకలుగా తీసుకుంటే కండరాలు, ఎముకలు దృఢంగా ఉంటాయి.
* బరువు తగ్గాలనుకునేవారు ఈ తృణధాన్యాల మొలకల్ని రోజూ తినొచ్చు. ఇందులోని పీచు జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి