చిన్నారికి మీరే మార్గదర్శి!
close
Published : 23/03/2021 01:11 IST

చిన్నారికి మీరే మార్గదర్శి!

తమ కలల పంట... కంటి వెలుగైన పిల్లల్ని ఎవరైనా ఎంతో అపురూపంగా పెంచాలనుకుంటారు. అందుకోసం ఎన్నో జాగ్రత్తలూ తీసుకుంటారు. పెంపకానికి సంబంధించి మరెన్నో విషయాలూ తెలుసుకోవాలనుకుంటారు. మీరూ అలాగే అనుకుంటున్నారా...
అయితే వీటిని ఒకసారి గమనించండి.

తల్లిదండ్రులను పిల్లలెప్పుడూ అనుకరిస్తూనే ఉంటారు. మీరు మాట్లాడే విధానం, చేసే పనులు, భావోద్వేగాలు... ఇవన్నీ పిల్లల్ని ప్రభావితం చేస్తాయి. మీరు ప్రేమగా మాట్లాడుతూ కాస్త సహనంతో వ్యవహరిస్తే పిల్లలూ అవే పద్ధతుల్ని నేర్చుకుంటారు.
అడ్డుచెప్పకూడదు...
పిల్లలు చేసే ప్రతి పనికీ కొంతమంది తల్లిదండ్రులు అడ్డుచెబుతుంటారు. ‘ఇది చెయ్యొద్దు.. అది చెయ్యొద్దు...’ అని ఆంక్షలు విధిస్తుంటారు. దీంతో వాళ్లు సొంతంగా ఏ పని చేయడానికీ ఆసక్తి చూపించరు. ఏ పని చేయాలన్నా అమ్మానాన్న అనుమతి కోసం చూస్తుంటారు. ఇదే కొనసాగితే సొంతగా ఆలోచించే నైపుణ్యం చిన్నారులకు ఎప్పటికీ అలవడదు.
మీరూ మారాల్సిందే...
క్రమశిక్షణ పేరుతో చిన్నారులతో కాస్త కఠినంగా వ్యవహరించి ఉండొచ్చు. అయితే వారు కాస్త పెద్దయిన తర్వాత కూడా దాన్నే కొనసాగిస్తే మీకూ పిల్లలకూ మధ్య దూరం పెరుగుతుందేగానీ తగ్గదు. పరిస్థితులకు అనుగుణంగా మీరూ మారితేనే పిల్లలకు దగ్గర కాగలుగుతారు.
మీ ప్రవర్తనతో చెప్పాలి...
తల్లిదండ్రులుగా బిడ్డలు చేసిన తప్పులను వాళ్లకు తెలియజేయాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. అదే సమయంలో వాటిని ఎత్తిచూపడమే పనిగా పెట్టుకోకూడదు. చిన్నారులు తెలియక పొరపాట్లు చేసినా వారి పట్ల మీరు చూపించే ప్రేమాభిమానాల్లో ఎలాంటి మార్పూ ఉండకూడదు. ఇదే విషయాన్ని మాటల్లో కంటే మీ ప్రవర్తన ద్వారా తెలియజేస్తే బాగుంటుంది.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి