రజస్వల అయ్యింది..ఏం తినిపించాలి?
close
Published : 26/03/2021 00:34 IST

రజస్వల అయ్యింది..ఏం తినిపించాలి?

మా పాప వయసు పదేళ్లు. ఈమధ్యే రజస్వల అయ్యింది. చాలా నీరసంగా ఉంటోంది. తనకేం పెట్టాలో అర్థం కావడం లేదు. మా అమ్మావాళ్లు బెల్లం కలిపిన నువ్వుండలు పెడితే మంచిదంటున్నారు. నిజమేనా?

- అపర్ణ, రాజమండ్రి

రజస్వల అయిన ఆడపిల్లకు కొన్ని ప్రాంతాల్లో నువ్వుండలు, బెల్లం అరిసెలు, పుట్టు వంటి ఆహారపదార్థాలను తినిపించి వేడుకలా చేస్తారు. వాటిని అప్పుడు మాత్రమే కాదు తర్వాత కూడా పెట్టొచ్చు. నెలసరి మొదలైన అమ్మాయిల్లో ఐరన్‌ లోపం ఏర్పడుతుంది. ముఖ్యంగా పది, పదకొండేళ్లకే పీరియడ్స్‌ మొదలవుతున్నవారిలో ఈ లోపం తీవ్రంగా ఉంటుంది. పోషకాహారంతో దీన్ని జయించవచ్చు.
సరైన మోతాదులో ఇనుము, మాంసకృత్తులు, బి-కాంప్లెక్స్‌ విటమిన్లు, ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్‌ ఎ, సి, క్యాల్షియం మీ పాపకు రోజూ అందేలా చూడాలి. అంటే తృణధాన్యాలతో చేసిన జావలు, పాలు, పండ్లరసాల్లాంటివి ఇవ్వాలి. ముఖ్యంగా పాలు, పెరుగు, ఆకుకూరలు, పప్పుదినుసులు, ముడి ధాన్యాల (దంపుడు బియ్యం, రాగి పిండి)తో చేసిన పదార్థాలను ఆ సమయంలో ఆహారంలో చేర్చాలి. పెసరట్టు, ఆవిరికుడుము, ఆమ్లెట్‌, పాలకూర సూప్‌, గోంగూర పచ్చడి, పుదీనా చట్నీ... లాంటివి ఇస్తూ విటమిన్లు ఎ, సి ఉండే ఉసిరి, జామ, నిమ్మ,  బత్తాయి లాంటి పండ్లను అలవాటు చేయాలి. చిప్స్‌, పచ్చళ్లు, స్వీట్లకు దూరంగా ఉంచాలి. ఇవన్నీ చేసినా మీ అమ్మాయి ఇంకా నీరసంగానే ఉంటే... ఒకసారి వైద్యులని సంప్రదిస్తే మంచిది.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి