వేసవిలో పీహెచ్‌ స్థాయులు నిలకడగా...
close
Updated : 27/03/2021 00:57 IST

వేసవిలో పీహెచ్‌ స్థాయులు నిలకడగా...

వేడి అధికంగా ఉండే ఈ వేసవిలో నిలకడగా ఉండని శరీరం పీహెచ్‌ స్థాయులను ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తేనే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు అంటున్నారు చర్మవైద్య నిపుణులు. ఇందుకు కొన్ని సూచనలూ చేస్తున్నారు.
కాలానికి తగ్గట్లుగా...  వాతావరణంలోని వేడి కారణంగా చర్మం పొడారిపోతుంది. కొందరు చర్మం మంట, దురద, దద్దుర్లు వంటి సమస్యలనెదుర్కొంటే, మరికొందరిలో చర్మం జిడ్డు కారడం, మచ్చలు ఏర్పడటం కనిపిస్తుంది. దీనికి కారణం శరీరం పీహెచ్‌ స్థాయులు మారడమే. ఆయా కాలాలకు తగ్గట్లుగా ఈ స్థాయులను సమన్వయం చేసుకోగలిగితే ఈ తరహా సమస్యలకు దూరంగా ఉండొచ్చు.

తేమగా... తగినంతగా నీరు, నిమ్మరసం, తాజా పండ్లరసాలు, కొబ్బరినీళ్లు వంటి ద్రవాహారాలను ఎక్కువగా తీసుకోవాలి. అప్పుడే చర్మసంబంధిత అనారోగ్యాల నుంచి బయటపడొచ్చు. అలాగే రోజూ తీసుకునే ఆహారంలో నిమ్మరసాన్ని చేర్చుకోవడం మంచిది. దీంతోపాటు గ్రీన్‌టీ, తాజా కూరగాయలతో చేసే సలాడ్లు, పండ్లరసాలన్నింటిలోనూ కలిపే కాస్తంత నిమ్మరసం... చర్మాన్ని డీహైడ్రేట్‌ కాకుండా కాపాడుతుంది.

ఆకు కూరల్లో... ఏ,సీ,ఈ,కే విటమిన్లు పుష్కలంగా ఉండే ఆకు కూరలు, ఆకుపచ్చని కూరగాయలను రోజూ ఆహారంలో చేర్చుకోవాలి. వీటిలోని కెరొటనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు చర్మకణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాదు, వీటిలోని అధిక పీచు, ఐరన్‌, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం చర్మాన్ని సంరక్షిస్తాయి.

ఓట్స్‌... చర్మంపై మృత కణాలను పోగొట్టి, కొత్తకణాల అభివృద్ధికి తోడ్పడే ఓట్స్‌ను వేసవిలో అత్యంత విలువైన ఆహారంగా నిపుణులు పరిగణిస్తున్నారు. వీటితో తయారుచేసే ఆహారం శరీర పీహెచ్‌ స్థాయులను నిలకడగా ఉంచగలదు. అలాగే కాఫీ, టీలను అధికంగా తీసుకోకుండా, బదులుగా గ్రీన్‌, తాజా పుదీనా, నిమ్మగడ్డి వేసే టీలను తాగితే చాలా మంచిది. ఇవి చర్మాన్ని తేమగా, ఆరోగ్యంగా ఉంచుతాయి.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి