సేంద్రియ సేద్యం... తెచ్చింది పురస్కారం!
close
Updated : 27/03/2021 01:01 IST

సేంద్రియ సేద్యం... తెచ్చింది పురస్కారం!

ముఫ్పై ఏళ్లు నిండకుండానే భర్త చనిపోతే... సేద్యాన్ని చేతిలోకి తీసుకుందీమె. ఒంటరిగా పొలంలోకి అడుగుపెట్టింది. స్వీయశిక్షణతో పంటను లాభాలబాట పట్టించింది  ఆరెకరాల్లో సేంద్రియ పద్ధతిలో చేసిన వ్యవసాయం.. ఈమెను ‘ఉత్తమ మహిళారైతు’గా నిలిపింది. కేరళకు చెందిన డాలీ జోసెఫ్‌ స్ఫూర్తి కథనమిది.
కాసర్‌గోడ్‌లోని పతిక్కరా గ్రామానికి చెందిన డాలీకు జోసెఫ్‌తో వివాహమైంది. ఉన్న కాస్త పొలంలో వ్యవసాయం చేసేవాడు భర్త. ముగ్గురు పిల్లలతో ఆ కుటుంబం సంతోషంగా ఉండేది. అయితే జోసెఫ్‌ అకస్మాత్తుగా అనారోగ్యంతో చనిపోయాడు. అప్పటికి డాలీ వయసు 28 ఏళ్లు. భర్త సేద్యం చేసే ఆరెకరాల పొలం తప్ప చేతిలో ఏమీ లేదు. అప్పటికి కొబ్బరి మొక్కలు, వరి మాత్రం ఉండే తమ పొలంలో వేరే పంటలకూ చోటు ఇవ్వాలనుకుంది. అలా అల్లం, పసుపు వంటివి వేసింది. అలాగే ఇంటి మిద్దెపై కూరగాయలు, ఆకుకూరలు పెంచడం మొదలుపెట్టింది. సమీపంలోని పడన్నెకాడ్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి విత్తనాలను సేకరించి తెచ్చుకునేది. సేద్యంలో మెలకువలను నేర్చుకుంటూ 20 కేజీల విత్తనాలు వేస్తే 80 కేజీల వరి పండేలా కృషి చేసింది.
అతి పెద్ద క్యాలీఫ్లవర్‌... మిద్దెతోటను గ్రీన్‌హౌస్‌గా మార్చింది డాలీ. అందులో నాణ్యమైన విత్తనాలతో ఉల్లి, క్యాలీఫ్లవర్‌, క్యాబేజీ, క్యారెట్‌, టొమాటోలు, వంకాయలు వంటి కూరగాయలను పెద్ద ఎత్తున పండించడం మొదలుపెట్టింది. ఇక్కడ పండే క్యాలీఫ్లవర్‌, క్యాబేజీల పరిమాణం చూసి చాలామంది సలహాలు, సూచనలకు ఈమె వద్దకు వచ్చేవారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున పరిశోధన నిమిత్తం విద్యార్థులు వచ్చేస్థాయికి ఈమె మిద్దెతోట ఎదిగింది. ‘సేంద్రియ క్రిమిసంహారక మందులను తయారుచేయడం నేర్చుకున్నా. రసాయనరహితంగా  పండిస్తున్న కాయగూరలు, ఆకుకూరలకు డిమాండ్‌ పెరిగింది. వీటిని ఎకో షాప్స్‌, వెల్లారికుండ్‌ రైతు బజారులో విక్రయించి లాభాలు ఆర్జిస్తున్నా. ‘డాలీ పచ్చకరి’ పేరుతో యూట్యూబ్‌ ఛానెల్‌ను నిర్వహిస్తున్నా. ఇందులో వ్యవసాయంతోపాటు క్రిమిసంహారక మందుల తయారీ నుంచి వినియోగించడం వరకు చెబుతుంటా. దీనికి లక్షకు పైగానే  వీక్షకులున్నారు. నేను చేస్తున్న సేద్యాన్ని వీడియో రూపంలో కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి గతేడాది అందజేశా. నా వ్యవసాయ పద్ధతులకుగాను ‘ఉత్తమ మహిళారైతు’ అవార్డు వరించింది. నా ముగ్గురు పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు వారికి ఆసక్తి ఉంటే వ్యవసాయమూ నేర్పుతా’ అంటోంది డాలీ.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి