వెదురు బొమ్మలకు ప్రాణం పోస్తుంది..!
close
Updated : 27/03/2021 01:02 IST

వెదురు బొమ్మలకు ప్రాణం పోస్తుంది..!

వెదురుతో చేసిన వేణువు వేల రాగాలను పలికిస్తే... లావణ్య చేతిలో పడ్డ వెదురు... అందమైన కళాకృతులుగా మారిపోతోంది. ఆమె చేతులు వెదురు బొమ్మలకు ప్రాణం పోస్తున్నాయి. ఆ సృజనే గల్లీ నుంచి దిల్లీ వరకు ఆమె ప్రత్యేకతను చాటింది. ఇటీవల దిల్లీలో నిర్వహించిన ‘టాయ్‌ఫెయిర్‌’లో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌కు చెందిన పిల్లి లావణ్య రూపొందించిన వెదురు బొమ్మలను ప్రదర్శించారు. దీనికి హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ వీటిని ప్రత్యేకంగా ప్రశంసించారు. పూలబుట్టలు, పక్షిగూళ్లు, దేవాలయాలు, పడవలు, విమానాలు... ఇలా వేలాది ఆకృతులు ఆమె చేతుల్లో ప్రాణం పోసుకున్నాయి. కులవృత్తికి తన సృజనను జోడించి భర్త, అత్తమామల ప్రోత్సాహంతో ముందుకు సాగుతోంది లావణ్య. గత నాలుగేళ్లలో దిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్‌, వరంగల్‌, వైజాగ్‌, విజయవాడ నుంచి హస్తకళా ప్రదర్శనకు ఆహ్వానాలనూ అందుకుంది. దిల్లీలోని హస్తకళలు, క్రాఫ్ట్‌ మ్యూజియంలో ఇటీవలే ఈమె పేరు నమోదైంది కూడా. అంతేకాదు ఆసక్తి ఉన్న మహిళలకు వెదురు బొమ్మలు అల్లడాన్నీ నేర్పిస్తోంది.

- మిరియాల గణేష్‌కుమార్‌, పెద్దపల్లి

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి