రెండు రోజులే..ఎందుకిలా?
close
Updated : 28/03/2021 00:44 IST

రెండు రోజులే..ఎందుకిలా?

మా పాపకు పదమూడేళ్లు. నెలసరి మొదలై రెండేళ్లవుతోంది. అయినా ఇప్పటికీ రెగ్యులర్‌గా రావడం లేదు. అలాగే రెండు రోజులు మాత్రమే రక్తస్రావమవుతోంది. ఎందుకిలా జరుగుతుంది? - ఓ సోదరి
నెలసరి మొదలైన తొలినాళ్లలో, అలాగే ఆగిపోయే చివరి దశలో హార్మోన్ల అసమతుల్యత ఉంటుంది. అందువల్లే ఇలా జరుగుతుంది. రుతుచక్రం చాలా అంశాలపై ఆధారపడుతుంది. మెదడులోని హైపోథాలమస్‌  నుంచి సిగ్నల్స్‌ మొదట పిట్యూటరీ గ్రంథికి, అక్కడి నుంచి అండాశయానికి చేరతాయి. అప్పుడు హార్మోన్లు ఉత్తేజితమై గర్భాశయం మీద  ప్రభావం చూపడంతో  నెలసరి వస్తుంది.  దీన్నే వైద్య పరిభాషలో హైపోథాలమో పిట్యూటరీ ఒవేరియన్‌ యాక్సస్‌ (హెచ్‌పీవో యాక్సస్‌) అంటాం. మనం భావోద్వేగాలకు గురైనప్పుడు ఈ వ్యవస్థలన్నీ ప్రభావితమవుతాయి. మీ పాపకు పదమూడేళ్లని రాశారు. ఈ వయసులో చిన్నారులు తెలియని ఒత్తిడికి గురవుతుంటారు. చదువులు, పెరిగే వయసు, శరీరంలో వస్తున్న మార్పులు (బరువు పెరగడం/తగ్గడం లాంటివి)... వీటన్నింటి వల్ల వారు తమకు తెలియకుండానే ఒత్తిడికి లోనవుతుంటారు.  హెచ్‌పీవో యాక్సస్‌ పరిణతి చెందడానికి రెండు మూడేళ్లయినా పడుతుంది. పదకొండేళ్లకు పీరియడ్స్‌ వచ్చినంత మాత్రాన త్వరగా అది కుదురుకోదు. కాస్త సమయం పడుతుంది. అలాకాకుండా పాపకు తీవ్రరక్తస్రావం, కడుపునొప్పి, రక్తహీనత లాంటి సమస్యలతో బాధపడుతోంటే లేదా పీరియడ్స్‌ రాకుండా  లావవుతోంటే మాత్రం ఆలోచించాలి. అలాంటివేమీ లేనప్పుడు కంగారుపడాల్సిన అవసరం లేదు.
మీరేం చేయాలంటే... పాప ఏ విషయంలో ఒత్తిడికి లోనవుతుందో గమనించి దాన్ని తగ్గించే ప్రయత్నం చేయండి. పిండి పదార్థాలు తక్కువగా, ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకునేలా చూడండి.  వ్యాయామం తప్పనిసరి. అమ్మాయి ఎదుగుదలలో ఇదొక మార్పు మాత్రమే.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి