తీరైన  ఆకృతి కోసం...
close
Updated : 28/03/2021 00:50 IST

తీరైన  ఆకృతి కోసం...

భుజాల దగ్గర కాస్త విశాలంగా ఉండి నడుము సన్నగా ఉంటే... శరీరం ఆంగ్ల అక్షరం ‘వి’ ఆకారంలో చూడచక్కగా ఉంటుంది. అలాంటి తీరైన ఆకృతి కావాలంటే ఈ వ్యాయామాలు ఎంతగానో ఉపయోగపడతాయి.

నేల మీద కాళ్లను దూరంగా ఉంచి కూర్చోవాలి. కుడి మోచేతిని ఫొటోలో చూపిన విధంగా నేలపై ఆనించాలి. ఎడమచేతిని తిన్నగా పైకిలేపి చేతి వేళ్లను చూస్తుండాలి. ఈ స్థితిలో అర నిమిషం పాటు ఉండాలి. కుడి, ఎడమ చేతులతో నాలుగుసార్ల చొప్పున చేయాలి. దీంతో వీపు దగ్గర ఉన్న అదనపు కొవ్వు కరుగుతుంది. అంతేకాదు మెడ, భుజాల నొప్పీ తగ్గుతుంది.

సుఖాసనంలో కూర్చుని రెండు చేతులను వెనకపెట్టుకుని మెల్లగా పైకి లేవాలి. మోకాళ్లను నేల మీద ఆనించాలి. పిరుదులు, నడుము పైకి లేపాలి. తలను వెనక్కు వంచాలి. అరనిమిషంపాటు ఈ స్థితిలో ఉండాలి. ఇలా మూడు నుంచి ఆరుసార్లు చేయాలి. దీంతో చేతులు, భుజాలు, వెన్నెముక కండరాలు బలోపేతమవుతాయి. మణికట్టు దగ్గర నొప్పి ఉన్నవాళ్లు ఇది చేయకూడదు.

కాళ్లను ఎడంగా పెట్టి కూర్చోవాలి. ఫొటోలో చూపిన విధంగా కుడి మోకాలి మీద పైకి లేచి కుడిచేతిని పక్కన ఉంచాలి. ఎడమకాలును నిటారుగా ఉంచాలి. ఎడమచేతిని పైకి లేపి దాన్ని చూస్తుండాలి. ఇలా అరనిమిషంపాటు ఉండి మెల్లగా విశ్రాంతి తీసుకోవాలి. ఇలా రెండు, మూడుసార్లు చేసిన తర్వాత ఎడమచేత్తోనూ చేయాలి. దీంతో నడుము, పొట్ట దగ్గరి కండరాలు బలోపేతం అవుతాయి.

కాళ్లు చాపి నేల మీద కూర్చోవాలి. చేతులు వెనక్కు పెట్టి.. వాటి మీదే శరీరం బరువు మోపి నడుము, పిరుదులను పైపి లేపాలి. మొత్తం బరువంతా పాదాలు, చేతుల మీద ఉంచాలి. ఈ స్థితిలో అర నిమిషంపాటు ఉండాలి. శ్వాస తీసుకుంటూ శరీరాన్ని పైకి లేపాలి. శ్వాస వదులుతూ కిందికి రావాలి. ఇలా ఆరుసార్లు చేయాలి. మొదట్లో మూడుసార్లు చేసినా సరిపోతుంది. దీంతో శరీర పైభాగంలోని అదనపు కొవ్వు త్వరగా కరిగిపోతుంది.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి