ఇంటి పని మొత్తం ఒక్కరే చేస్తున్నారా..!
close
Updated : 29/03/2021 03:17 IST

ఇంటి పని మొత్తం ఒక్కరే చేస్తున్నారా..!

భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైతే... ఆ ఇంట్లో హడావుడి మరీ ఎక్కువగా ఉంటుంది. ఉదయం లేచింది మొదలు ప్రతి పనీ సమయానికి పూర్తిచేయాల్సిందే. అలాంటప్పుడు ఈ విషయాలను ఒకసారి గమనించండి.

ద్దరూ ఉద్యోగులైనా సాధారణంగా ఇంటి పని మొత్తం ఒకరి మీదే పడుతుంది. రెండోవాళ్లు ఇంటి పనుల్లో సాయం చేయడానికి ఎలాంటి ఉత్సాహం చూపించరు. ఇలా జరిగినంతకాలం బానే ఉంటుంది. కానీ ఒక్కరి మీదే పూర్తి భారం పడటం వల్ల అది వారి ఆరోగ్యంపైనా ప్రభావాన్ని చూపిస్తుంది. అధిక శ్రమ, ఒత్తిడి వల్ల అనారోగ్యాల బారినపడే ప్రమాదం ఎక్కువ. అలాకాకుండా ఇద్దరూ కలిసి ఇంటి పనులు చేసుకుంటే ఒక్కరి మీదే భారం పడకుండా ఉంటుంది. కలిసిమెలిసి పనులు చేసుకోవడం వల్ల చాలా విషయాలను మాట్లాడుకునే అవకాశమూ దొరుకుతుంది. దాంతో ఇద్దరి మధ్యా అనుబంధమూ మరింత పెరుగుతుంది కూడా.
పరిస్థితులు ఒకేలా ఉండవు: ఎప్పుడూ చకచకా పనులు చేసే వాళ్లకు కూడా ఒక్కోసారి ఏ పనీ చేయబుద్ధికాదు. ఒంట్లో నలతగా ఉండి వేగంగా పనులు చేయలేకపోవచ్చు లేదా మనసంతా చిరాగ్గా ఉండొచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఎదుటివాళ్లు ఆ పనిని కాస్త అందుకునేలా ఉండాలి. ‘నీకు బాలేదు కదా... నేను బయట తినేస్తా. నువ్వు విశ్రాంతి తీసుకో’ అంటుంటారు కొంతమంది. ఉద్యోగానికి వెళ్లేవాళ్లు బయట తినేయొచ్చు. మరి ఒంట్లో బాగోక ఇంట్లోనే ఉన్నవాళ్ల పరిస్థితినీ అర్థం చేసుకోవాలి కదా. ఇలాంటి పరిస్థితుల్లో సాయం చెయ్యాలన్నా ఇంటి పనులు కాస్త తెలిసుండాలి. కాబట్టి తరచూ ఇంటి పనుల్లో ఎదుటివాళ్లకు  సాయపడుతూ ఉంటే అవసరమైనప్పుడు అదో పెద్ద సమస్యగా ఉండదు.
పిల్లల పనులూ: చిన్నారులను చదివించడం, వాళ్ల అవసరాలను దగ్గరుండి చూడటం.. ఆరోగ్యానికి సంబంధించిన విషయాల మీద అవగాహన కల్పించడం... ఇవన్నీ ఇద్దరూ చూసుకోవాలి.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి