రంగులను వదిలిద్దామిలా...
close
Updated : 29/03/2021 03:22 IST

రంగులను వదిలిద్దామిలా...

అంబరాన్ని తాకే సంబరమే హోలీ. ఇది రంగుల పండగ. వర్ణాల్లో మునిగి తేలే సంతోషకరమైన సమయమంతా కేరింతలతో నిండిపోతుంది. ఆ తర్వాతే అసలైన సమస్య మొదలవుతుంది. తెల్లని దుస్తులు సప్తవర్ణాలను పులుముకుంటాయి. రంగుల దుస్తుల గురించి చెప్పక్కర్లేదు. అవి వాటి అసలు వర్ణంలో మనకు కనిపించవు. వాటిని తిరిగి మునుపటి వాటిలా మార్చాలంటే కాస్త కష్టమే. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే మీ దుస్తులకున్న రంగులు వదిలి తిరిగి మిలమిలా మెరుస్తాయి.

నిమ్మరసంతో.. : ఆమ్లగుణం ఉండే నిమ్మరసం రంగు మరకలను తేలికగా పోగొట్టగలదు. దుస్తులపై రంగులు పడిన భాగాలను నిమ్మరసం కలిపిన నీటిలో పావుగంటసేపు నానబెట్టి, చేతులతో మృదువుగా రుద్దాలి. ఆ తర్వాత వాషింగ్‌ పౌడర్‌ కలిపిన నీటిలో ముంచి ఉతికితే చాలు. అలాకాకుండా దుస్తులు మొత్తం రంగులమయంగా మారితే.. అర బకెట్‌ నీటిలో నాలుగైదు నిమ్మకాయల రసాన్ని పిండి అందులో అరగంటసేపు నానబెట్టి ఆ తర్వాత డిటర్జెంట్‌తో ఉతకాలి.  
వైట్‌ వెనిగర్‌తో.. : చల్లటి నీటిని నింపిన బకెట్‌లో అరకప్పు వైట్‌ వెనిగర్‌, చెంచా డిటర్జెంట్‌ వేసి బాగా కలపాలి. ఈ నీటిలో రంగులంటిన దుస్తులను అరగంటసేపు నానబెట్టి, ఆ తర్వాత మెల్లిగా బ్రష్‌తో రుద్దాలి. చివరగా మంచినీటిలో పిండితే చాలు. రంగులు వదిలిపోతాయి.
అమోనియా కలిపి.. : ఇంటి శుభ్రతలో వినియోగించే అమోనియా మిక్సర్‌ క్లీనర్‌ కూడా రంగుల మరకలను పోగొడుతుంది. దుస్తులపై రంగులంటిన చోట ఈ క్లీనర్‌ను స్ప్రే చేసి కొన్ని నిమిషాలు వదిలేయాలి. టవల్‌ లేదా టిష్యూ పేపర్‌తో ఆ ప్రాంతంలో మెల్లిగా అద్దాలి. ఆ తర్వాత డిటర్జెంట్‌ పౌడర్‌ కలిపిన నీటిలో ముంచి ఉతికి, ఎక్కువ నీటిలో పిండాలి. 

విడివిడిగా : రంగులు పడిన దుస్తులను ఇతర వాటితో కలిపి నానబెట్టకూడదు. ఇలా చేస్తే వీటి వర్ణాలన్నీ మామూలు దుస్తులకూ అంటుకునే ప్రమాదం ఉంది. అందుకే విడివిడిగా ఉతికితేనే మంచిది. అలాగే రంగులు పడిన దుస్తులను ఎక్కువ సమయం అలా వదిలేయకుండా, వీలైనంత త్వరగా  శుభ్రం చేయడానికి ప్రయత్నించాలి. అప్పుడే అవి పోవడానికి అవకాశం ఉంటుంది. లేదంటే దుస్తులకు పూర్తిగా అంటుకుంటాయి. ఆలస్యమైతే వాటిని పోగొట్టడం మరింత కష్టమవుతుంది.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి