తినండి... తగ్గండి..!
close
Updated : 03/04/2021 03:41 IST

తినండి... తగ్గండి..!

మండుటెండల నుంచి ఉపశమనం పొందడానికి ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిదని ఆలోచిస్తున్నారా... అయితే నిరభ్యంతరంగా కీరదోసను ఎంచుకోవచ్చు. ఎందుకంటే...
* కీరదోసలో విటమిన్‌-ఎ, సి, క్యాల్షియం, ఇనుము, జింక్‌, పొటాషియం, మెగ్నీషియం ఎక్కువ. దీంట్లోని యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. అంతేకాదు జీవక్రియ సక్రమంగా సాగేందుకు తోడ్పడతాయి.
* దీంట్లో తొంభైశాతం నీరు ఉంటుంది. ఇది శరీరానికి వేడిని తట్టుకునే సామర్థ్యాన్ని అందిస్తుంది. కిడ్నీ, మూత్రాశయ సమస్యలు రాకుండా చేస్తుంది.
* శరీరంలో అవసరానికి మించి వేడి ఉంటే రక్తనాళాలు గట్టిపడే అవకాశం ఉంటుంది. దీంతో రక్తసరఫరాలో అవాంతరాలు ఏర్పడి గుండెకు సంబంధిత వ్యాధులూ వచ్చే ప్రమాదముంటుంది. కీరాను తీసుకుంటే అలాంటి సమస్యల నుంచి బైటపడొచ్చు.
* రోజూ మధాహ్న భోజనానికి ముందు కీరాను తీసుకోవడం వల్ల తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. దీంట్లోని ఎంజైమ్‌లు ఆకలిని పెంచుతాయి.
* మధుమేహగ్రస్తులకూ ఇది మంచి ఆహారం. కీరాలో ఉండే విటమిన్‌-సి వల్ల రోగనిరోధక శక్తీ పెరుగుతుంది.
* కీరాను తీసుకోవడం వల్ల మలబద్ధక సమస్య ఉండదు. కొలెన్‌ క్యాన్సర్‌ రాకుండా కాపాడుతుందని కొన్ని అధ్యయనాలూ చెబుతున్నాయి.
* దీంట్లో నీరు, పీచు అధికంగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునేవాళ్లు తరచూ తీసుకుంటే ఫలితం ఉంటుంది.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి