సృజనాత్మకంగా ఆలోచించాలంటే...
close
Updated : 03/04/2021 03:42 IST

సృజనాత్మకంగా ఆలోచించాలంటే...

అందరూ కష్టపడే పనిచేస్తారు. కానీ సరికొత్తగా ఆలోచించే కొందరే లక్ష్యాన్ని సాధించగలుగుతారు. అలా సృజనాత్మకంగా ఆలోచించాలంటే కొన్ని ప్రత్యేక పద్ధతులను పాటించాలంటున్నారు నిపుణులు. అవేంటంటే...
పని మీద ఆసక్తి ఉండాలి: ప్రతి ఒక్కరికీ ఏదో ఒక రంగమంటే ఇష్టం ఉంటుంది కదా. మీ అభిరుచికి అద్దంపట్టే రంగాన్నే ఎంచుకుంటే ఎంతటి కష్టాన్నయినా ఇష్టంగా భరించగలుగుతారు. అప్పుడు పనిని మొక్కుబడిగా కాకుండా ఎంతో ఆసక్తిగా చేస్తారు.  
చదవాలి: మీరు ఎంచుకున్న రంగానికి సంబంధించిన పుస్తకాలను చదువుతుండాలి. దాంట్లోని ముఖ్యమైన విషయాలను ఒకచోట రాసుకోవాలి. వాటి మీద మరింత విస్తృతంగా ఆలోచిస్తే మీకూ సరికొత్త ఆలోచనలు రావచ్చు. మీకు ఆసక్తి ఉన్న విషయం మీద అంతర్జాలంలో ఎంతో సమాచారం అందుబాటులో ఉంటుంది. సమయం చిక్కినప్పుడల్లా దాన్ని చదవాలి. అలాగే సృజనాత్మకంగా ఆలోచించడానికి పుస్తక పఠనమూ ఎంతగానో తోడ్పడుతుంది.  
వినాలి: వివిధ విషయాల మీద ప్రముఖుల అభిప్రాయాలను వింటుండాలి. అవి మీ ఆలోచనా పరిధిని మరింతగా విస్తరించడానికి ఎంతగానో తోడ్పడతాయి. వర్క్‌షాప్‌లు, సెమినార్లకూ హాజరుకావడం ద్వారా నైపుణ్యాలను పెంచుకోవడానికి ప్రయత్నించాలి. మేధోమధనం ఎప్పుడూ జరుగుతూనే ఉండాలి. అలాగే విని ఊరుకోవడమే కాదు... ఒక విషయం మీద మాట్లాడటమూ అలవాటు చేసుకోవాలి.
ఇంకా ఏంచేయాలంటే: మెదడును ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోవాలి. లక్ష్యాల మీదే దృష్టిని కేంద్రీకరించాలి.  బాధాకరమైన విషయాలను ఎప్పటికప్పుడు మర్చిపోవాలి. శారీరకంగా, మానసికంగా తగిన విశ్రాంతి తీసుకుంటే.. సరికొత్తగా ఆలోచిస్తూ ఉల్లాసంగా, ఉత్సాహంగా పనిచేయగలుగుతారు.


కొత్తగా ఆలోచించాలి:
కొత్త ఆలోచనలన్నీ గొప్పవాళ్లకే వస్తాయని అపోహ పడుతుంటారు చాలామంది. కానీ ప్రతి ఒక్కరికీ చక్కని ఆలోచనలు వస్తాయి. మీ అభిరుచులకు అద్దంపట్టే రంగాన్నే ఎంచుకుంటే ఇష్టంగా, సృజనాత్మకంగా ఆలోచించగలుగుతారు.


మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి