కూర్చుంటే కష్టమే..!
close
Updated : 03/04/2021 03:43 IST

కూర్చుంటే కష్టమే..!

గంటల తరబడి సీట్లోనే కూర్చుని పనిచేయడం వల్ల భవిష్యత్తులో రకరకాల అనారోగ్యాలు తలెత్తుతాయి. ముఖ్యంగా వెన్ను, నడుము, కాళ్ల నొప్పులు బాధిస్తాయి. అలా కాకూడదంటే...
ఎప్పుడూ కూర్చుని ఉండటమే కాకుండా వీలైతే మీరు పనిచేసే చోట స్టాండింగ్‌ డెస్క్‌లను ఏర్పాటు చేసుకోండి. లేదా ఎర్గోనోమిక్‌ ఛైర్స్‌ మార్కెట్‌లో దొరుకుతాయి. వాటిని ప్రయత్నించవచ్చు. ఇవి మీ శరీర భంగిమను సరైన తీరులో ఉంచుతాయి. అలాగే కూర్చున్నప్పుడు కాళ్ల కింద ఫుట్‌రెస్ట్‌ తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. ఇది మీ కాళ్లు, పాదాలకు తగినంత విశ్రాంతిని అందిస్తుంది. మీరు కుర్చీలో కూర్చున్నప్పుడు కాళ్లు నేలను తాకకపోతే క్రమంగా అది వెన్నునొప్పికి దారితీయొచ్చు. తొడల కండరాలు కుంచించుకుపోతాయి. మీ పాదాల కింద ఫుట్‌రెస్ట్‌ ఉంటే.. గాల్లో పాదాలు వేలాడకుండా ఉంటాయి. దాంతో వెన్నుపై ఒత్తిడి తగ్గుతుంది. కాబట్టి మీకు తప్పనిసరిగా ఫుట్‌రెస్ట్‌ అవసరం ఉంటుంది.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి