నువ్వూ...నేనూ... మనం!
close
Published : 04/04/2021 02:50 IST

నువ్వూ...నేనూ... మనం!

ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగాలు...ఆలుమగల మధ్య ఉండే సమయాన్ని తగ్గిస్తున్నాయి. ఫలితంగా చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద సమస్యలూ అల్లుకుపోతున్నాయి. వాటిని అధిగమించాలంటే...
* భార్యాభర్తల బంధంలో ప్రేమాభిమానాలే కాదు ఒకరంటే మరొకరికి బాధ్యతా అవసరమే. రోజువారీ జీవనశైలిలో భాగంగా అవసరమయ్యే చిన్నపనులూ కావొచ్చు. మనసు విప్పి చెప్పినప్పుడు ఎదుటివారికి అర్థమవుతుంది. ‘భోజనం చేశావా’ అని చేసే చిన్న ఫోన్‌ కాల్‌. ‘నువ్వు నీరసంగా ఉన్నావు కదా! ఈ రోజు నేను వెళ్లి కూరగాయలు తీసుకొస్తాను’ అనడం వంటివన్నీ ఈ తరహానే.
* దంపతులన్నాక గిల్లికజ్జాలు, చిరు పోట్లాటలు సహజం. అయితే వాటిని పెద్దవి చేసుకోవద్దు.  ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుంది. ఒకరు ప్రశ్నిస్తుంటే....మౌనంగా ఉండటం వల్ల గొడవ సద్దుమణిగిపోతుందనుకోవడం పొరబాటే. దానివల్ల కొన్నిసార్లు అవతలివారు మనల్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారేమో అన్న సందేహమూ తలెత్తుతుంది. వాదనలకు దిగకుండా సామరస్యంగా  మాట్లాడుకునే మాటలే మీ గొడవకు ముగింపు పలుకుతాయి.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి