నురుగుతో పాటే స్క్రబ్‌!
close
Published : 04/04/2021 02:57 IST

నురుగుతో పాటే స్క్రబ్‌!

మార్కెట్లో బోలెడు రకాల సబ్బులు అందుబాటులో ఉంటున్నాయి. వాటిలో ఫెల్టెడ్‌ సబ్బులు కాస్త విభిన్నం.
స్క్రబ్‌లూ, లూఫాల అవసరం లేకుండా చేసేదే ఫెల్టెడ్‌ సోప్‌. దీని అర్థం ఉన్నితో చుట్టిన సబ్బు అని. ఇలా చేసిన సబ్బు ఎక్కువ రోజులు మన్నుతుంది. రంగు రంగుల ఊల్‌ రోవింగ్‌ని ఈ ఫెల్టెడ్‌ సబ్బుకోసం ఎంచుకోవాలి. దీన్ని పలుచగా పరిచి సబ్బు కొనలు కనిపించకుండా ఒకసారి అడ్డంగా, మరోసారి నిలువుగా చుట్టేయాలి. ఆపై ఈ సబ్బును నైలాన్‌వస్త్రంలో పెట్టి మూటలా ముడివేయాలి. ఈ మూటను వేడినీళ్లలో ముప్ఫై సెకన్లు ఉంచి తీస్తే.. ఉన్ని బిగుతుగా మారి సబ్బును పట్టుకుంటుంది. తర్వాత గట్టిగా పిండేసి ఓ పావుగంటయ్యాక సబ్బును తీసి చల్లటి నీళ్లతో కడిగేస్తే చాలు. ఫెల్ట్‌ సబ్బు తయారైనట్లే. అవసరమైతే దీనిలో ఎసెన్షియల్‌ ఆయిల్స్‌నీ కలపవచ్చు. దీన్ని చక్కగా అలంకరించి బహుమతులుగానూ ఇచ్చుకోవచ్చు.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి