రాజకీయ వేదికపై... అందాల దీక్ష
close
Published : 04/04/2021 02:57 IST

రాజకీయ వేదికపై... అందాల దీక్ష

అందాలపోటీ వేదికపైనే కాదు, విద్యార్థినిగా రాజకీయ అంశాలపై వేడివేడి చర్చల్లోనూ పాల్గొంది ఈ అందాల సుందరి 24 ఏళ్ల దీక్షాసింగ్‌. మిస్‌ ఇండియా -2015లో రన్నరప్‌గా నిలిచిన ఈమె ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. మార్పు కోసం పరితపించే మనస్తత్వం, సవాళ్లను స్వీకరించే నైజం... అవే తనని రాజకీయ వేదికపైకి తీసుకొచ్చాయంటోంది. ‘కెరీర్‌ కోసం నగరంలో ఉంటున్నా....ఊరంటే నాకెంతో ఇష్టం. చిన్నప్పటి నుంచీ చూస్తున్నా...ఏ మార్పూ కనిపించలేదు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. అందుకే మా గ్రామాన్ని ప్రగతి పథంలోకి తీసుకువచ్చే బాధ్యతను ఈసారి నేను తీసుకోవాలనుకుంటున్నా. దానికోసమే ఎన్నికల్లో జాన్‌పూర్‌ జిల్లా బక్షా డెవలప్‌మెంట్‌ బ్లాక్‌లో పోటీ చేస్తున్నా’ అంటోంది దీక్ష. తన అందంతో కుర్రకారును కట్టిపడేసిన ఈమెది చిత్తోరి గ్రామం. వాళ్ల నాన్న వ్యాపారరీత్యా గోవాలో ఉంటోంది. మూడోతరగతి వరకు స్వగ్రామంలోని పాఠశాలలో, తర్వాత చదువులను ముంబయి, గోవాల్లో పూర్తి చేసింది. చదువయ్యాక మోడలింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుంది. మిస్‌ ఇండియా పోటీల ఫైనల్స్‌లో రన్నరప్‌గా నిలిచింది. గోవాలో ఎమ్‌ఈఎస్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ కామర్స్‌లో పట్టా తీసుకుంది. ఈమె చేసిన ‘తెరీ ఆంఖోంమే’, ‘రబ్బా మెహర్‌ కరీ’ మ్యూజిక్‌ వీడియోలకు కోట్ల వ్యూస్‌ వచ్చాయి. దీంతో దీక్ష దేశవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకుంది.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి