అమ్మ నమ్మకాన్ని నిలబెట్టా...!
close
Published : 04/04/2021 02:58 IST

అమ్మ నమ్మకాన్ని నిలబెట్టా...!

వందకు పైగా దేశాల్లో విస్తరించిన రూ.9300 కోట్ల విలువైన సంస్థ టాఫె రథసారథి మల్లికా శ్రీనివాసన్‌. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఎంపిక మండలి (పీఈఎస్‌బీ) ఛైర్మన్‌గా నియమితురాలయ్యారు. ఈ ఘనత సాధించిన తొలి ప్రైవేట్‌ రంగ ప్రతినిధి ఆమె.
‘వ్యాపార రంగంలో మహిళలు ఏ మాత్రం మగవారికి తీసిపోరనే మా అమ్మ నమ్మకాన్ని నిలబెట్టగలిగా. ఇది నాకెంతో గర్వంగా అనిపిస్తుంది. కలిసి పనిచేయడం, నేర్చుకోవడం, తర్వాత మన ఆలోచనలను ఆచరణలోకి తెచ్చి అభివృద్ధి సాధించడం..ఇదీ నా పద్ధతి’ అనే మల్లికా శ్రీనివాసన్‌..  మూడున్నర దశాబ్దాల వృత్తిజీవితంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఆటోమొబైల్‌ రంగంలో ‘ట్రాక్టర్‌ క్వీన్‌’గా పేరు గడించారు. ఏడాదికి లక్షన్నర ట్రాక్టర్ల అమ్మకాలతో అమెరికా, యూరప్‌ దేశాల్లో కూడా తమ సంస్థకు పేరు ప్రఖ్యాతులు సాధించిపెట్టారు. హైడ్రాలిక్‌ పంపులు, డీజిల్‌ ఇంజిన్లు తదితర ఉత్పత్తుల తయారీలోకీ¨ ప్రవేశించారు. వ్యాపారంలోనే కాదు సమాజానికి తిరిగివ్వడంలోనూ మల్లికది పెద్దచెయ్యే! క్యాన్సర్‌ ఆసుపత్రులకు నిధులు సమకూర్చుతున్నారు. శంకర్‌ నేత్రాలయ లాంటి సంస్థలకు అండగా నిలుస్తున్నారామె.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి