వక్షోజాలు పెరిగే అవకాశముందా!
close
Updated : 05/04/2021 00:50 IST

వక్షోజాలు పెరిగే అవకాశముందా!

నా వయసు 24. వక్షోజాలు చిన్నగా ఉన్నాయి. అందులోనూ ఒకటి మరీ చిన్నగా ఉంది. టీషర్టులు వేసుకుంటే తేడా బాగా కనిపిస్తోంది. దీంతో నలుగురిలోనూ కలవలేక పోతున్నా. ఇదేమైనా సమస్యా?  - ఓ సోదరి
దేమీ అసాధారణ సమస్య కాదు. అలాగని వ్యాధీ కాదు. వంశపారంపర్యంగానూ కొందరికి ఈ ఇబ్బంది వస్తుంది. చాలామందికి వక్షోజాల పరిమాణంలో కొంచెం తేడా ఉంటుంది. మీ విషయంలో అది కాస్త ఎక్కువగా ఉందంతే. దీంట్లో కంగారు పడాల్సింది ఏమీలేదు. ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్న చాలామంది బ్యూటీ పార్లర్‌లకు వెళ్లి మసాజ్లు చేయించుకుంటారు. అనేక రకాల క్రీమ్‌లూ వాడుతుంటారు. నిజానికి వీటి సైజు పెరగడానికి క్రీములు, మసాజ్‌లు, లేజర్లూ పనిచేయవు. చేస్తాయని చెప్పినా నమ్మకండి.
సర్జరీతోనే సాధ్యం... కాస్మెటిక్‌ సర్జరీ ఒక్కటే దీనికి పరిష్కారం. రక రకాల పద్ధతుల్లో దీన్ని చేస్తారు. దాంట్లో ఫ్యాట్‌ గ్రాఫ్టింగ్‌ ఒకటి. మన శరీరంలోనే ఎక్కడిదైనా కొవ్వు తీసి తక్కువగా ఉన్న వక్షోజంలో అమరుస్తారు. ఇలా ఫ్యాట్‌ను ఇంజెక్ట్‌ చేయడం వల్ల వక్షోజాలూ సమానంగా ఉండే అవకాశం ఉంటుంది. రెండో పద్ధతి.. ఇంప్లాంట్స్‌ వాడటం. దీనివల్ల కూడా రెండింటినీ సమానం చేయొచ్చు. ఈ సర్జరీల వల్ల ప్రమాదం ఏమీ ఉండదు గానీ ఖర్చు ఎక్కువ.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి