బాడీలాంగ్వేజ్‌ బాగుండాలంటే...
close
Published : 08/04/2021 00:17 IST

బాడీలాంగ్వేజ్‌ బాగుండాలంటే...

ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ‘బాడీ లాంగ్వేజ్‌’ ఎంతో అవసరమన్న సంగతి తెలిసిందే. ఇది చక్కగా ఉండాలంటే ఈ విషయాలను గుర్తుంచు కోవాలంటున్నారు నిపుణులు.

మాటలతో పనిలేకుండా శారీరక కదలికలతోనే మన భావాల్ని ఎదుటివారికి ‘బాడీ లాంగ్వేజ్‌’తో తెలియజేసే వీలుంటుంది. ఇది చక్కగా ఉంటే మీరంటే అందరికీ సదభిప్రాయం ఏర్పడుతుంది కూడా.
ముఖాన్ని తాకకూడదు: ఎదుటివారితో మాట్లాడేటప్పుడు చాలామంది తలను తాకుతుంటారు. కళ్లు నలుపేస్తుంటారు. అవసరం లేకపోయినా నోటికి చెయ్యి అడ్డుపెట్టుకుని మాట్లాడుతుంటారు. మాట్లాడేటప్పుడూ, వినేటప్పుడు కూడా తల, ముఖాన్ని చేతులతో అసలు తాకకూడదు. ఇవన్నీ ఆసక్తి లేకపోవడం, ఆత్మన్యూనత, సిగ్గుపడటానికి చిహ్నాలు.
విచారం వద్దు: కొందరు ముఖాన్ని ఎప్పుడూ విచారంగా పెడుతుంటారు. ఇలా ఉంటే అవతలి వ్యక్తులు మీతో మాట కలపడానికి కూడా ఆసక్తి చూపించరు. ముఖం ఎప్పుడూ చిరునవ్వుతో ఉంటే ఎవరైనా మీతో మాట్లాడటానికి ఆసక్తి చూపిస్తారు.
నేరుగా చూడాలి: ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తిగా మిమ్మల్ని ఎదుటివాళ్లు గుర్తించాలంటే... నేరుగా వారి కళ్లలోకి చూస్తూ మాట్లాడాలి. ఎదురుగా ఇద్దరుంటే ఇద్దర్నీ చూస్తూ మాట్లాడాలి. ఒక్కళ్లనే చూస్తూ సంభాషించటం సరికాదు.
చిరునవ్వు: సానుకూలంగా ఆలోచించే వ్యక్తి ఎప్పుడూ చిరునవ్వుతోనే ఉంటాడు. ఇది సహజంగా ఉండాలి.  కృత్రిమంగా, బలవంతంగా, వెకిలిగా ఉండకూడదు. చిరునవ్వు ఎప్పుడూ హాయిగా, ప్రశాంతంగా ఉండాలి. అప్పుడు ఎవరైనా మీతో మాట్లాడటానికి ఉత్సాహం చూపిస్తారు కూడా.

 

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి