కాస్త సున్నితంగా చెప్పండి...
close
Published : 08/04/2021 00:21 IST

కాస్త సున్నితంగా చెప్పండి...

దంపతుల మధ్య ఎన్నో అసంతృప్తులు ఉండొచ్చు. ఇంట్లోవాళ్లే కదా అనే చనువుతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తుంటారు కొందరు. దీంతో తెలియకుండానే ఎదుటివాళ్లను బాధపెట్టినవాళ్లు అవుతారు. మీరేం చెప్పారు అనేదాని కంటే... ఎలా చెప్పారు అన్నదే ముఖ్యం.

ఆఫీసు నుంచి ఆలస్యంగా ఇంటికి వచ్చే భాగస్వామి ఆ తర్వాత ల్యాప్‌టాప్‌ ముందే కాలం గడిపేస్తున్నారు అనుకోండి. అలాంటప్పుడు ‘నీ ప్రవర్తన నాకేం నచ్చలేదు. వచ్చిన వెంటనే ల్యాప్‌టాప్‌ ముందేసుకుని కూర్చుంటున్నావు’ అనడం కంటే... ‘పది నిమిషాలు నాతో మాట్లాడిన తర్వాత నీ పని చూసుకుంటే బాగుంటుందిగా... ఒక్కద్దానికీ బోరుగా ఉంది’ అని చెప్పి చూడండి. ఇలా సున్నితంగా మీ మనసులోని మాటను తెలియజేస్తే... ఎదుటివాళ్లు కూడా సానుకూలంగా స్పందించే అవకాశముంటుంది.  
విమర్శించకూడదు: దంపతులిద్దరి కుటుంబ నేపథ్యాలు, అలవాట్లు, అభిరుచులు వేర్వేరుగా ఉంటాయి. అలాంటప్పుడు ఎదుటివారి పద్ధతులు కాస్త కొత్తగానూ, వింతగా అనిపించవచ్చు. అంత మాత్రాన
వెంటనే
భాగస్వామిని పనితీరును విమర్శించడం మొదలుపెట్టకూడదు. ఒక్కోసారి మీరు ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు.. ఎదుటివాళ్లు సరదాగా బయటకు వెళదామని అడగొచ్చు. అలాంటప్పుడు కోపంతో రగిలిపోకుండా... చేస్తున్న పని ఎంత ముఖ్యమైందో కాస్తా సున్నితంగా వివరించాలి. అవసరమైతే భాగస్వామి సాయమూ తీసుకోవచ్చు. ఏం చెప్పారన్నది కాదు... ఎలా చెప్పారన్నదే ముఖ్యం.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి