గులాబీలా మోము మెరుస్తుందిలా!
close
Published : 08/04/2021 00:24 IST

గులాబీలా మోము మెరుస్తుందిలా!

ఒక్కోసారి ఉన్నట్టుండి ముఖం పొడిబారిపోతుంది. నిర్జీవంగానూ కనిపిస్తుంది.... ఇలాంటప్పుడు ఈ గులాబీ పూతలు ప్రయత్నించి చూడండి. వీటితో ఉపశమనం పొంది మీ చర్మం కళగా కనిపిస్తుంది.

చెంచా చొప్పున యాపిల్‌ తురుము, గులాబీనీళ్లూ, అరటి పండు గుజ్జు తీసుకోవాలి. దీనికి అరచెంచా ఓట్స్‌ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసుకుని పావుగంటయ్యాక చల్లటి నీళ్లతో కడిగేస్తే సరి. ఇది చర్మంపై టాన్‌ని తొలగిస్తుంది. యాపిల్‌, గులాబీ నీటిలోని విటమిన్‌-సి యాంటీఆక్సిడెంట్‌గా పనిచేసి అతినీలలోహిత కిరణాల నుంచి కాపాడుతుంది. నిగారింపునీ ఇస్తుంది. అరటిపండులోని పోషకాలు తేమని అందించి కాంతివంతంగా కనిపించేలా చేస్తాయి.

* అరకప్పు గులాబీరేకల ముద్దకు, చెంచా చొప్పున నారింజ తొక్కల పొడి, చెంచా పెరుగు, తేనె చేర్చి బాగా కలపాలి. దీన్ని ముఖం, మెడ, చేతులకు ప్యాక్‌లా వేసుకోవాలి. ఆరాక గోరువెచ్చని నీళ్లతో మృదువుగా మర్దనా చేసుకుంటూ కడిగేస్తే సరి. చక్కటి నిగారింపు వస్తుంది. గులాబీల్లో సహజంగానే నూనెలుంటాయి. ఇవి తేమను అందించి మెరిపిస్తాయి. నారింజ తొక్కల పొడిలోని విటమిన్‌సి, ఏ లు మేనిని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ పూతలను రాత్రి నిద్రపోయే ముందు ప్రయత్నిస్తే... మరుసటి రోజు ఉదయం మీ మోము మృదువుగా, ప్రకాశవంతంగా మారుతుంది.

వేసవిలో నూలు, చేనేత రకాల్ని  ఎంచుకుంటే... చెమట పీల్చుకుని  చల్లదనాన్ని ఇస్తాయి. వాటిల్లో లేత  రంగులకు ప్రాధాన్యం ఇవ్వండి.  ఇవి వేడిని అడ్డుకోగలుగుతాయి.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి