ఉపాధినీ, సేవనీ... ముడి వేసింది!
close
Published : 08/04/2021 00:29 IST

ఉపాధినీ, సేవనీ... ముడి వేసింది!

కొవిడ్‌ ఆమె కలల్ని భగ్నం చేయలేక పోయింది. సరికదా సరికొత్త ఉపాధి మార్గాన్ని చూపింది. ఆ దారిలో ఆదాయాన్ని ఆర్జిస్తూనే ఆపన్నులకు సాయం అందిస్తోందా యువ ఫ్యాషన్‌ డిజైనర్‌.

ఇరవై ఆరేళ్ల సర్తికా సింఘాది నాసిక్‌.  చెన్నైలోని నిఫ్ట్‌ నుంచి 2016లో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిందామె. పలు ఫ్యాషన్‌ బ్రాండ్స్‌తో కలిసి పనిచేసింది. సెలబ్రిటీలకు స్టైలిస్ట్‌గా వ్యవహరించింది. సొంతంగా బ్రాండ్‌ను తీసుకువద్దామనుకునే లోపే కొవిడ్‌ మొదలైంది.  ఈ మహమ్మారి వల్ల ప్రపంచం మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. సెలూన్‌లూ, పార్లర్‌లు దాదాపు ఆ ఏడాదంతా మూతబడ్డాయి.  అందరికీ జుట్టు విపరీతంగా పెరిగి పోయింది. దీనిగురించి సోషల్‌ మీడియాలో హ్యాష్‌లాక్‌డౌన్‌హెయిర్‌గోల్స్‌, హ్యాష్‌నోహెయిర్‌కట్‌ పేరిట చర్చలూ జరిగాయి. జోకులు పేలాయి. సర్తికా మాత్రం ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలనుకుంది. అలా మొదలైందే.. ‘గోగో స్క్రూంఛీస్‌’ బ్రాండ్‌. ఇది జుట్టుకు కట్టుకోవడానికి వాడే  హెయిర్‌ బ్యాండ్‌. మే, 2020లో వీటి తయారీని మొదలుపెట్టిందామె. ఇంట్లో వాడకుండా మిగిలిపోయిన నాణ్యమైన వస్త్రంతో స్వయంగా చేత్తో ఈ స్క్రూంఛీలను తయారుచేస్తోంది. వీటిని సోషల్‌ మీడియా వేదికగా అమ్ముతోంది.

ఎలా మొదలైందంటే...
సర్తికా రూపొందించిన ఈ బ్యాండ్‌లను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ‘చాలా బాగున్నాయి, మాకూ చేసిపెట్టమని స్నేహితులు, బంధువులూ కోరారు. అందుకోసం ఇంట్లో ఉన్నవీ బయట షాపుల ద్వారా సేకరించినవి... ఇలా రకరకాల వస్త్రాలతో స్క్రూంఛీలను తయారుచేసింది. హాబీగా మొదలుపెట్టిన ఈ ప్రాజెక్ట్‌ లాభాల్ని తెచ్చిపెట్టింది. ఆ తర్వాత సామాజిక కోణాన్ని జోడించడంతో మరింత అర్థవంతంగా మారిపోయింది. ‘కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్నవారిలో కొందరికైనా సాయం అందించాలనుకున్నా. లాక్‌డౌన్‌ తర్వాత నా స్క్రూంచీస్‌ అమ్మకాలు సాగవనుకున్నా. ఆర్డర్లు ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. ప్రతి నెలా నా ఆదాయంలో సగాన్ని ‘ఫీడ్‌ ఆఫ్‌ లవ్‌’ అనే స్వచ్ఛంద సంస్థకు’ అందిస్తా అంటోంది సర్తికా. అనాథ చిన్నారుల కోసం బొమ్మలను,  రోడ్లపై నిద్రించే వారికోసం దుప్పట్లను సేకరించడం, అనాథల ఆకలి తీర్చడం లాంటి సేవలను ఈ సంస్థ  పదేళ్లుగా కొనసాగిస్తోంది. తన విజయం ఇచ్చిన ఉత్సాహంతో త్వరలో ‘గోగో మెన్‌’పేరుతో మరో కొత్త బ్రాండ్‌నూ మొదలుపెట్టబోతోంది సర్తికా.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి