ఉన్న ఇంటినే కాస్త పెద్దదిగా!
close
Published : 09/04/2021 00:56 IST

ఉన్న ఇంటినే కాస్త పెద్దదిగా!

రాగిణి వాళ్లది చక్కటి ఇండిపెండెంట్‌ హౌస్‌. అయితే బయట నుంచి చూస్తే పెద్దగా అనిపించినా లోపల గదులన్నీ చిన్నచిన్నగా ఉంటాయి. మరి ఇలా ఉన్న చిన్న ఇంటినే అందంగా, ఆకర్షణీయంగా పెట్టుకోవడంతోపాటు పెద్దదిలా కనిపించేలా చేయడమెలానో చూద్దామా...
ల్లు పెద్దదిగా, విశాలంగా కనిపించాలంటే గోడలకు లేత రంగులుండాలి. నీలం, క్రీమ్‌, నారింజ, పసుపు రంగులు బాగుంటాయి.
కాంతివంతమైన దీపాలు... కాంతి తక్కువగా ఉంటే ఇల్లు ఉన్న పరిమాణం కంటే చిన్నగా, నిర్జీవంగా కనిపిస్తుంది. అలా కాకుండా ఉండాలంటే.. బాగా వెలుతురునిచ్చే కాంతివంతమైన విద్యుత్‌ దీపాలను ప్రతి గదిలోనూ అమర్చాలి.

తక్కువ ఫర్నిచర్‌... ఎక్కువ ఫర్నిచర్‌ ఉంటే గదులు చిన్నగా కనిపిస్తాయి. కాబట్టి వీలైనంత తక్కువగా ఉండేలా చూసుకోవాలి. అలాగే అ సామానంతా లేత రంగుల్లో, గోడలకు మ్యాచ్‌ చేసుకోండి. అప్పుడు చిన్నగా ఉన్నట్లు అనిపించదు.
అద్దాలు.. ఇంటిని పెద్దదిగా, విశాలంగా చూపడంలో అద్దం ముందు ఉంటుంది. సూర్యకాంతి పడే ప్రదేశాల్లో వీటిని అమరిస్తే గదులన్నీ ప్రకాశవంతంగా మారడంతోపాటు పెద్దగానూ అనిపిస్తాయి. ప్రధాన ద్వారానికి ఎదురుగా హాలులో ఓ పెద్ద అద్దాన్ని ఏర్పాటు చేస్తే ఇంటికి కొత్త అందం వస్తుంది.
పరిశుభ్రంగా... ఇల్లంతా దుస్తులు, బొమ్మలు, ఆటవస్తువులతో చిందరవందరగా ఉన్నా... చిన్నగానూ అనిపిస్తుంది. ఎక్కడి వస్తువులను అక్కడ చక్కగా సర్దేస్తే బాగుంటుంది.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి