ఉమ్మడి కుటుంబంలోకి అడుగుపెట్టబోతున్నారా...
close
Published : 10/04/2021 01:51 IST

ఉమ్మడి కుటుంబంలోకి అడుగుపెట్టబోతున్నారా...

శ్రావ్యకు పెళ్లి కుదిరింది. త్వరలోనే ఉమ్మడి కుటుంబంలోకి అడుగుపెట్టబోతోంది. ఒక్కతే సంతానం కావడంతో అమ్మానాన్నా ఆమెను ఎంతో గారాబంగా పెంచారు. అక్కడ అందరిలో ఇమడగలనో లేదోనని ఇప్పటినుంచే బెంగ పెట్టుకుంటోంది. ఇలా ఆలోచించేవాళ్లు కొన్ని విషయాలను గుర్తుపెట్టుకుంటే ఎలాంటి ఇబ్బందీ ఉండదు. అవేమిటంటే...

కుటుంబసభ్యులు ఎక్కువమంది ఉంటారు కాబట్టి ఎవరితో ఎలా మెలగాలో తెలియక భయపడుతుంటారు చాలామంది. వీటిని పక్కన పెట్టి అందరితో మెల్లగా మాట కలపడం అలవాటు చేసుకోవాలి. వారి చర్చల్లో మీరూ ఉత్సాహంగా పాలుపంచుకోవాలి.
అంతా మనవాళ్లే: కుటుంబ సభ్యులందరినీ మీ వాళ్లుగానే భావిస్తే ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఇంటి విషయాల్లో ఏమైనా మార్పులూ, చేర్పులూ చేయాలనుకున్నా, మీకు ఏదైనా ఇబ్బందిగా అనిపించినా ఆ విషయాన్ని సున్నితంగా తెలియజేయాలి.
బంధువులను గౌరవించాలి: ఇతరుల నుంచి గౌరవం, ప్రేమాభిమానాలను పొందాలంటే ముందుగా మీరూ వాళ్లను గౌరవించడం నేర్చుకోవాలి. అందరి మధ్యా మీకేదైనా ఇబ్బందీ కలగొచ్చు. ఇదే విషయాన్ని కాస్త మర్యాదగా, సున్నితంగా తెలియజేయాలి. అయినా అందరూ మనవాళ్లే అని సర్దుకుపోతే.. పెద్ద ఇబ్బంది కూడా చిన్నగానే కనిపిస్తుంది.
సాయం అందించాలి: కొత్తగా కుటుంబంలోకి అడుపెట్టిన తర్వాత కొన్ని బాధ్యతలనూ తీసుకోవాల్సి ఉంటుంది. అంటీముట్టనట్టుగా ఉండకుండా మీకు అప్పగించిన పనులను ఇష్టంగా చేయాలి. ఇలా నలుగురితో కలిసి పనిచేయడం వల్ల ఆలోచనలు, అభిప్రాయాలను పంచుకోవడానికి వీలవుతుంది. కుటుంబ సభ్యులతో అనుబంధం మరింత బలపడుతుంది.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి