గర్భసంచిలో గడ్డలకు ఆపరేషన్‌ చేయాలా!
close
Published : 10/04/2021 01:58 IST

గర్భసంచిలో గడ్డలకు ఆపరేషన్‌ చేయాలా!

మా చెల్లికి 35 ఏళ్లు. తనకు గర్భసంచిలో గడ్డలున్నాయని వైద్యులు చెప్పారు. ఇవి మందులతో కరుగుతాయా?ఆపరేషన్‌ తప్పనిసరిగా చేయించుకోవాలా?

- ఓ సోదరి

మీకున్న సమస్యను ఫైబ్రాయిడ్స్‌ అంటారు. క్యాన్సర్‌ కాని కణితులు దాదాపు 40 నుంచి 45 శాతం వరకు వివిధ సైజుల్లో గర్భాశయంలోని పలు ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఇవి ఉన్నంత మాత్రాన సమస్య ఉందేమోనని కంగారు పడొద్దు. అయితే గర్భాశయంలో నొప్పి, పిల్లలు పుట్టకపోవడం, గడ్డలు వేగంగా పెరుగుతుండటం, తరచూ గర్భస్రావమవడం.. లాంటి సమస్యలు కనిపిస్తే మాత్రం వాటి గురించి ఆలోచించాల్సిందే. ఇలాంటి సమస్య ఉన్నప్పుడు మూత్రాశయం మీద ఒత్తిడి ఎక్కువై తరచూ మూత్రానికి వెళ్లాల్సిన అవసరం రావొచ్చు. ఈ కణితులనేవి గర్భాశయ ముఖద్వారం, లోపల ఎండోమెట్రియమ్‌ క్యావిటీలో, కండరంలో లేదా బయటకు ఉన్నాయా అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. రోగికి ఉన్న లక్షణాలు, వయసు, ఆరోగ్య పరిస్థితుల ఆధారంగా ఆపరేషన్‌ అవసరమా, కాదా అనే విషయాన్ని వైద్యులు నిర్ధారిస్తారు. కొన్ని రకాల మందుల వల్ల ఎక్కువ దుష్ప్రభావాలు ఉంటాయి. కాబట్టి వీటిని ప్రపంచంలోని చాలా దేశాల్లో నిషేధించారు కూడా. మందులనేవి తాత్కలిక బాధ ఉపశమనం కలిగిస్తాయే తప్ప కణితులను తగ్గించవు. ప్రెగ్నెన్సీ వద్దనుకుని, రక్తస్రావం కంట్రోల్‌ అయితే చాలనుకునేవారికి బ్లీడింగ్‌ను నియంత్రించే మాత్రలు లేదా హార్మోనల్‌ మాత్రలను సూచిస్తారు. గర్భాశయంలో మెరినా లాంటి పరికరాన్ని అమర్చడం ద్వారా ఈ సమస్యకు తాత్కలిక ఉపశమనాన్ని కలిగిస్తారు. అసలు ఆపరేషనే వద్దనుకునేవారికి  మూడు రకాల చికిత్సా విధానాలున్నాయి. అవి యూటరైన్‌ ఆర్టరీ ఎంబోలైౖజేషన్‌, ఎమ్‌ఆర్‌ఐ గైడెడ్‌, ఫోకస్‌ అల్ట్రాసౌండ్‌ పరీక్షలను కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో, కొన్ని రకాల ఫైబ్రాయిడ్స్‌కు మాత్రమే ఉపయోగించగలం. కాబట్టి వీటిలో మీకెలాంటి చికిత్స అవసరమో డాక్టర్లే సూచిస్తారు.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి