జంక్‌ఫుడ్‌ తిన్నాక...
close
Published : 12/04/2021 00:38 IST

జంక్‌ఫుడ్‌ తిన్నాక...

పిల్లల నుంచి పెద్దల వరకూ జంక్‌ఫుడ్‌ని లొట్టలేసుకుని తింటుంటారు. కొందరికి రోజూ తినడం అలవాటైతే... మరికొందరు వారాంతాల్లో ఫుల్‌గా లాగించేస్తారు. దీనివల్ల కడుపుబ్బరం, అధిక రక్తపోటు, కోపం, చిరాకు, ఆందోళన... లాంటి ఇబ్బందులు వస్తుంటాయి. ఇవి తిన్న తర్వాత కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకుంటే ఈ ఇబ్బంది నుంచి సులువుగా బయటపడొచ్చంటున్నారు నిపుణులు. అవేమిటంటే...
అరటిపండు: యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి గుండె కొట్టుకోవడంలోని హెచ్చు తగ్గులను నియంత్రిస్తాయి. అరటిపండు తినడం వల్ల కడుపుబ్బరం, తలనొప్పిలాంటి ఇబ్బందులున్నా తగ్గుతాయి.
పెరుగు: దీంట్లో ఉండే బ్యాక్టీరియా ఆరోగ్యానికెంతో మేలు చేస్తుంది. కడుపు ఉబ్బరాన్ని నివారిస్తుంది. పెరుగులో కాసిన్ని దానిమ్మ గింజలు వేసుకుని తింటే రుచితోపాటు పోషకాలూ అందుతాయి.
నిమ్మరసం: జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తుంది. ఇందులోని విటమిన్‌-సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలోని అదనపు కొవ్వును కరిగించడానికీ తోడ్పడుతుంది.
సలాడ్‌: టొమాటో, కీరా ముక్కలు, నానబెట్టిన పెసలతో సలాడ్‌ చేసుకోవచ్చు.  ఆపైన కాసిన్ని ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తరుగు, నిమ్మరసం, కాస్త ఉప్పు వేసుకోవాలి. ఇది కూడా జీర్ణక్రియ సక్రమంగా సాగేలా చేస్తుంది.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి