మీ ఉనికిని మీరు కాపాడుకోండి!
close
Published : 12/04/2021 00:38 IST

మీ ఉనికిని మీరు కాపాడుకోండి!

చాలామంది ఆడపిల్లలు పెళ్లవ్వగానే తమ ఇష్టాయిష్టాలను, అభిరుచులను వదిలేసుకుంటారు. దీని ప్రభావం మొదట్లో తెలియకపోయినా... కాలక్రమేణా ప్రతికూల ఆలోచనలకు, నిరాశా నిస్పృహలకు కారణమవుతుంది. అలా కాకూడదంటే మీ ఉనికిని కాపాడుకుంటూనే కొత్తదనాన్నీ ఇముడ్చుకోండి అంటారు మానసిక నిపుణులు.
* మీ ఇష్టాయిష్టాలేమిటి, మీ ఆలోచనా విధానం ఎలా ఉంటుంది, ఏ విషయానికి ఎలా స్పందిస్తారు... మీ ఆకాంక్షలు, అవసరాలేంటి... ఇలా మీకు సంబంధించిన ప్రతి విషయంలో ఓ స్పష్టత ఉండాలి. ముందు మిమ్మల్ని మీరు అర్థం చేసుకోగలిగితే...అవతలి వారితోనూ హాయిగా గడిపేయగలరు.
* ప్రతి మనిషికీ మార్పు అవసరమే... అలాగని మీ వ్యక్తిత్వాన్ని చంపుకుని ప్రవర్తించొద్దు. ఎదుటివారికి నచ్చేట్లు ఉండాలని మీ సహజ స్వభావాన్ని దాచాల్సిన అవసరం లేదు. మీరెప్పుడూ ఎలా ఉంటారో అలాగే ఉండండి. ఎదుటివారి విషయంలోనూ అలానే ప్రవర్తించండి. అప్పుడే అనుబంధం ఆనందంగా సాగిపో తుంది.
* ప్రతి పనికీ భాగస్వామి మీదే ఆధారపడటం మొదలుపెడితే మీ మీద మీకు నమ్మకం పోతుంది. మీ పనులన్నీ మీరు సొంతంగా చేసుకోవడం నేర్చుకోవాలి. ఎంత బాధ్యతల్లో ఇమిడిపోయినా...మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మానొద్దు. మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయొద్దు. అప్పుడే మీరు, మీతో పాటు మీ కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి