కోరి కోరి కొబ్బరి తిందామా!
close
Updated : 15/04/2021 01:35 IST

కోరి కోరి కొబ్బరి తిందామా!

ఏ కాలంలో అయినా సులువుగా దొరికే వాటిల్లో కొబ్బరి ఒకటి. దీన్ని నేరుగా తిన్నా, వంటల్లో ఉపయోగించినా... బోలెడు పోషకాలు శరీరానికి అందుతాయి. అవేంటో తెలుసుకుందామా!

కొబ్బరిలో కెలొరీలు, ప్రొటీన్లు, మంచి కొవ్వు, పీచు వంటివెన్నో పోషకాలుంటాయి. ఇందులో విటమిన్‌ సి, ఇ, బి1, బి6, బి5, ఫోలేట్‌, బి3,లతో పాటు ఐరన్‌, క్యాల్షియం, ఫాస్ఫరస్‌, మాంగనీస్‌ వంటి ఖనిజాలూ సమృద్ధిగా దొరుకుతాయి. ఎదిగే పిల్లలు, ప్రొటీన్‌తోపాటు ఇతరత్రా పోషకాల లోపంతో బాధపడేవారూ రోజూ కాస్తయినా కొబ్బరి తింటే కండరాలు వృద్ధి చెందుతాయి. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.

* శరీరంలో ఇనుము లోపించినప్పుడు ఎర్రరక్తకణాలకు తగిన ఆక్సిజన్‌ అందకుండా, రక్తంలో హిమోగ్లోబిన్‌ను వృద్ధి కానీయకుండా అడ్డుకుంటుంది. రోజూ కప్పు కొబ్బరిపాలను ఆహారంగా తీసుకుంటే శరీరానికి కావలసిన దానిలో సగం ఐరన్‌ అందుతుందంటున్నారు నిపుణులు. కొబ్బరి తురుముకి కాస్త బెల్లం కలిపి తింటే రక్తహీనతా అదుపులో ఉంటుంది.

* జుట్టు రాలుతుంటే...జింక్‌ అధికంగా ఉండే కొబ్బరిని మీ ఆహారంలో భాగం చేసుకోండి. మాంగనీస్‌ నిల్వలు తగ్గినప్పుడు గ్లూకోజ్‌ స్థాయుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తాయి. ఇలాంటప్పుడు కాసిని కొబ్బరిపాలో, కొబ్బరి ముక్కో తీసుకున్నా చాలు సమన్వయం అవుతాయి.

* కొబ్బరిలో ఉండే కాపర్‌, విటమిన్‌ సిలు చర్మానికి సాగేతత్వాన్ని అందిస్తాయి. అందుకే దీన్ని ఎక్కువగా తీసుకునేవారి చర్మం తాజాగా నిగనిగలాడుతూ కనిపిస్తుంది. ముడతలు, చర్మంపై మచ్చలు వంటివి తగ్గుతాయి. ఇక దీనిలోని క్యాల్షియం, ఫాస్ఫరస్‌ శరీరానికి సమపాళ్లలో అందడం వల్ల ఎముకలు దృఢంగా మారతాయి.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి