మూత్రంలో రక్తం చారలు?
close
Published : 16/04/2021 02:29 IST

మూత్రంలో రక్తం చారలు?

నా వయసు నలభై. ఈ మధ్య అప్పుడప్పుడూ మూత్రంలో రక్తం మరకలు కనిపిస్తున్నాయి. అలాగే నెలసరి సమయంలో తీవ్రమైన దుర్వాసన వెలువడుతోంది. ఈ సమస్య తీరేదెలా?

- ఓ సోదరి

మూత్రంలో స్పాటింగ్‌ (రక్తం చారలు) కనిపిస్తుందంటే ఎక్కడి నుంచి వస్తుందనేది చూడాలి. ఇది మూత్రపిండాలకు సంబంధించిన రక్తపు జీరా లేదా గర్భాశయ జీరా అనేది నిర్ధరించుకోవాలి. మీరు ముందుగా యూరిన్‌ కల్చర్‌, కంప్లీట్‌ యూరినరీ ఎగ్జామినేషన్‌, అల్ట్రాసౌండ్‌ కేయూబీ (కిడ్నీ యూరినరీ బ్లాడర్‌), పెల్విస్‌ పరీక్షలు చేయించుకోవాలి. వీటివల్ల కిడ్నీల దారిలో ఏమైనా రాళ్లు ఉన్నాయా...మూత్రపిండాల సంచికి ఏమైనా ఇన్‌ఫెక్షన్‌ సోకిందా అనేది కూడా నిర్ధరణ అవుతుంది. కలయిక తర్వాత రోజు ఈ రకంగా చారలు కనిపిస్తున్నాయో లేదో గమనించాలి. ముందుగా మీరు గైనకాలజిస్ట్‌ను సంప్రదించండి. వారు పైన పేర్కొన్న పరీక్షలు చేసి మీ సమస్య ఏమిటో తెలుసుకుంటారు. దానికి అనుగుణంగా చికిత్సలు సూచిస్తారు.
రెండో విషయం...  పీరియడ్స్‌లో దుర్వాసన వస్తోందని రాశారు. దీన్నిబట్టి మీకు గర్భాశయ ముఖద్వారానికి (సర్విక్స్‌) సంబంధించిన ఇన్‌ఫెక్షన్‌ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయనిపిస్తోంది. ఈ ప్రాంతం దగ్గరి చర్మం లేచిపోవడం వల్ల అక్కడి రక్తపు చారలు మూత్రంలో కలుస్తున్నాయేమో తెలుసుకోవాలి. సర్విక్స్‌ వద్ద చర్మం పోవడాన్ని సర్వైకల్‌ ఇరోషన్‌ అంటారు. ఇలా జరిగితే మాటిమాటికి ఇన్‌ఫెక్షన్‌ రావొచ్చు. భార్యాభర్తలిద్దరూ చికిత్స తీసుకోవాలి. ఇబ్బంది తగ్గిన తర్వాత క్రయో కాటరీ/ఎలక్ట్రో కాటరీ చేయించుకుంటే సమస్యను పూర్తిగా తగ్గుతుంది. ఈ విధానాలన్నింటినీ పాటిస్తే సర్విక్స్‌ దగ్గర కొత్త చర్మం ఏర్పడి ఇన్‌ఫెక్షన్ల బాధ తప్పుతుంది. మీరోసారి కిడ్నీ, గర్భాశయ ముఖద్వారానికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి