షాపింగ్‌ ఖర్చును తగ్గించుకోండిలా!
close
Published : 17/04/2021 01:18 IST

షాపింగ్‌ ఖర్చును తగ్గించుకోండిలా!

మనకు అవసరమైనవి కొందాం అని షాపింగ్‌కు వెళతాం. తీరా వెళ్లాక ఆఫర్లు చూసి అవసరానికి మించి కొనేస్తాం. తర్వాత బిల్‌ చూస్తే ఇంత ఖర్చయిందే అని టెన్షన్‌. అందుకే షాపింగ్‌కి వెళ్లినప్పుడు వ్యాపార సంస్థల వలలో పడకుండా మన బడ్జెట్‌లోనే ఎలా తీసుకోవాలో చూద్దాం రండి..

షాపింగ్‌కు వెళ్లాక ఆఫర్లు చూసి కొనడం కంటే మీరేం కొనాలనుకుంటున్నారో ఇంటి దగ్గరే జాబితా రాసుకోండి. తర్వాత దాన్ని మళ్లీ గమనించి ఈ వస్తువులు ఎక్కడ తక్కువకి వస్తాయో ఆలోచించండి. ఇందుకోసం ఆన్‌లైన్‌, ఇరుగుపొరుగు వారి సలహాలు పనికొస్తాయి. ఈ రెండు విషయాల్ని ఆచరణలో పెడితే అటు అనవసరమైనవి కొనకుండా ఉంటారు, ఇటు నగదూ ఆదా అవుతుంది.
చెక్‌ చేసుకోవాలి.
పండగల సందర్భంగా కొన్ని సంస్థలు వివిధ ఆఫర్లను ప్రకటిస్తాయి. తక్కువకి వస్తున్నాయ్‌ కదాని చూసీచూడకుండా కొంటే మీకే నష్టం. ఎందుకంటే ఎక్కువగా ఇలాంటప్పుడు కొన్ని సంస్థలు గడువు తేదీకి దగ్గరలో ఉన్న వస్తువుల్ని వదిలించుకుంటాయి. కాబట్టి అవి చూసి మోసపోకుండా, ఏ వస్తువు కొన్నా ఒకటికి రెండుసార్లు, గడువు తేదీలు, నాణ్యతను సరిచూసుకోవాలి.
కార్డు ద్వారా చెల్లింపు
షాపింగ్‌లకు జరిపే లావాదేవీలన్నీ కార్డు ద్వారా చేయండి. పండగల సమయంలో కార్డు ద్వారా తీసుకున్న వాటికి రివార్డు పాయింట్ల ద్వారా గిఫ్ట్‌ వోచర్లు లభిస్తాయి.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి