రంగు వేయాలంటే.. ఇవి తెలియాలి
close
Published : 18/04/2021 01:19 IST

రంగు వేయాలంటే.. ఇవి తెలియాలి

తెల్లజుట్టుకు రంగేసుకోవడం పాత ట్రెండ్‌. రకరకాల రంగులతో జుట్టును మెరిపించడం ప్రస్తుతం యువత ఫ్యాషన్‌లో ఒక భాగం. కానీ పొరబాటున నప్పనిది ఎంచుకుంటే? అభాసుపాలవ్వాల్సి వస్తుంది. కాబట్టి, మొదటిసారిగా ప్రయత్నించేవారు కొన్ని చిట్కాలు పాటిస్తే.. అనుకున్న స్టైల్‌ సొంతం చేసుకోవచ్చు.

ముందుగా తెలుపు, పసిమి, చామన ఛాయ, నలుపు.. ఇలా మీ చర్మ రంగేదో చూసుకోవాలి. దాన్ని బట్టి మీకు సరిపోయేదే ఎంచుకోవాలి. బట్టల ఆధారంగానూ నిర్ణయించుకోవచ్చు. లేత నుంచి ముదురు వరకు వివిధ రకాల రంగులని మచ్చుకి ప్రయత్నించండి. వాటిలో మీకేది అద్భుతంగా ఉంటే.. దాన్నే వేసుకోవచ్చు.
* రంగు మాత్రమే కాదు షేడ్‌నూ చూసుకోవాలి. లేత రంగు మీకు బాగున్నంత మాత్రాన దానిలోని అన్ని షేడ్‌లూ నప్పాలనేం లేదు. అది సహజంగా మీ స్టైల్‌కు సరితూగాలి. ఇప్పుడు ఎన్నో టెక్నాలజీలు అందుబాటులో ఉన్నాయి. వాటి సాయంతో ఏది అనువైనదో ఎంచుకోవచ్చు.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి