అవిసెతో అందం... ఆరోగ్యం!
close
Published : 18/04/2021 01:19 IST

అవిసెతో అందం... ఆరోగ్యం!

వేసవిలో సూర్యుని నుంచి వచ్చే వేడిని తట్టుకునే శక్తి అవిసెగింజలకు ఉంది. అవిసె గింజల్లో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్‌, విటమిన్‌ బి1, బి6, పొటాషియం, క్యాల్షియం, ఐరన్‌, మెగ్నీషియం, ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు వంటి ఎన్నో పోషకాలున్నాయి.  
* రోజుకు రెండు టీ స్పూన్ల అవిసె గింజలు తీసుకుంటే ప్రీ, పోస్ట్‌ మెనోపాజ్‌ దశలో ఉన్నవారికి వేడిఆవిర్లు రాకుండా కాపాడతాయి. చాలామంది మహిళల్లో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాల లోపం వల్ల శరీరభాగాల్లో నీరు రావడం, వాపులు, నొప్పి వంటివి ఎక్కువగా ఉంటాయి. ఇలాంటివారు అవిసెగింజల్ని తరచూ తీసుకుంటే ఈ సమస్యల నుంచి బయట పడొచ్చు
* అవిసెగింజలు మన చర్మంలో సహజనూనెలని ఎక్కువగా విడుదలయ్యేలా చేస్తాయి. దీంతో చర్మం ఎప్పుడూ తేమగా ఉంటూ, మృదువుగా మారుతుంది. పొడిచర్మం వారికి ఇదొక చక్కటి పరిష్కారం. అవిసె గింజల నూనె తలకు పెట్టుకోవడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని