ఆత్మవిశ్వాసాన్ని పెంచండిలా...
close
Published : 18/04/2021 01:19 IST

ఆత్మవిశ్వాసాన్ని పెంచండిలా...

కొంతమంది పిల్లలు తమకేమీ రాదని ఆత్మన్యూనతతో బాధపడుతుంటారు. నిజానికి పిల్లల్లో ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. కానీ ఇంట్లో పరిస్థితులు, చుట్టూ జరుగుతున్న సంఘటనల కారణంగానే వాళ్లలా మారిపోతారు. కాబట్టి చిన్నారుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచాల్సిన బాధ్యత అమ్మానాన్నలదే! అందుకేం చేయాలంటే..

మీ ఒత్తిడిని వాళ్ల మీద రుద్దకండి. మాటి మాటికీ వాళ్లు చేసే పనుల్ని విమర్శించవద్దు. నలుగురిలో ఉన్నపుడు ’నా మాట వినకపోతే హాస్టల్‌కి పంపిస్తా’ అంటూ అరవకండి. దానికి వాళ్లు అవమానంగా ఫీలవుతారు. ఆత్మన్యూనతకి గురిచేస్తుంది.
* ఎప్పుడూ ఇతర పిల్లలతో పోల్చవద్దు. ముఖ్యంగా తోబుట్టువులతో అసలు పోల్చకండి. అలా పోల్చడం వల్ల అది ఆత్మన్యూనతకి దారితీసి, వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. ఎవరి వ్యక్తిత్వాలు వారివి, ఎవరి ప్రత్యేకతలు వారివి అని గుర్తుంచుకోండి.  
* మీలోని భయాల్ని, అనుమానాల్ని పిల్లల ముందు బయటపెట్టకండి. ధైర్యాన్ని నూరిపోస్తూ, సానుకూల అంశాల్ని ప్రస్తావించండి. మీ జీవితంలో జరిగిన సంక్లిష్ట సంఘటనల్ని చెబుతూ వాటినుంచి మీరెలా బయటపడ్డారో.. ఎలా పరిస్థితుల్ని అధిగమించారో వాళ్లకి తెలియజెబుతూ ఇంట్లో చర్చలు పెట్టండి. దీంతో వాళ్లలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
* పిల్లలు పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకుంటే ప్రశంసించండి. వాళ్లేం సాధించినా మెచ్చుకోండి. చిన్నారులు గెలిచిన బహుమతులను నలుగురికి చూపించి వాళ్ల ముందు గొప్పగా చెప్పండి. ఒక ప్రశంస వాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. అలానే ఏదైనా ప్రయత్నించి ఓడిపోతే నీకేమీ రాదని తిట్టకండి. ఓటమిని కూడా గెలుపుతో సమానంగా అంగీకరించాలని పిల్లలకు చెబుతూ వెన్నుతట్టి ప్రోత్సహించండి.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి