బలమైన బంధం మీదే!
close
Published : 18/04/2021 01:19 IST

బలమైన బంధం మీదే!

రెండు భిన్నమైన మనస్తత్వాలు వివాహబంధంతో ఒక్కటిగా ముడిపడతాయి. పెళ్లయిన కొత్తలో చిన్నపాటి గొడవలు, చిరు కోపాలు, అలకలు సహజమే. అయితే ఇరువురు ఒకరినొకరు అర్థం చేసుకుని, పరస్పరం గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకున్నప్పుడే భార్యాభర్తల మధ్య బంధం బలపడుతుంది. దంపతులిద్దరూ సంతోషంగా ఉంటేనే ఆ ఇల్లు స్వర్గంలా మారుతుంది. అలా మారాలంటే...

భార్యాభర్తలన్నాక తగువులు, చిన్నపాటి గొడవలు సాధారణం. అయితే అంత మాత్రన భాగస్వామి గురించి మీ కుటుంబ సభ్యులు, బంధువుల దగ్గర తక్కువ చేసి మాట్లాడొద్దు. తనతో మీకేదైనా సమస్య ఉంటే నేరుగా చెప్పాలే తప్ప ఇతరుల దగ్గర వారి గురించి తప్పుగా మాట్లాడొద్దు.
* ఆఫీసు, ఇతర సమస్యల వల్ల ఎదుటివారు తీరిక లేకుండా ఉన్నప్పుడు, అలాగే పని ఒత్తిడికి గురైనప్పుడు మీరే తనకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. అలాంటి సమయంలోనే ‘నేనున్నానంటూ’ భరోసా ఇస్తే వారి నిస్తేజం దూరంగా పారిపోతుంది.
* మీ ప్రేమను మాటలతోపాటు చేతల్లోనూ వ్యక్తం చేయండి. అలసిపోయి వచ్చిన తనకు మీ ప్రేమ రంగరించి వేడి వేడి కాఫీ అందించండి. ఆఫీసు/వ్యాపార విషయాల్లో తనకు మీ సాయమేమైనా కావాలంటే అందించడానికి సిద్ధంగా ఉండండి.
* మీరు తననుంచి ఏం ఆశిస్తున్నారో నేరుగా చెప్పండి. దాన్ని ఆచరణలో పెట్టడానికి కాస్తంత సమయం ఇవ్వండి. అంతే తప్ప అదేపనిగా మాటల పోటీకి దిగొద్దు. అప్పుడే తనకు మీపై గౌరవం పెరుగుతుంది.
* ఇతరులతో మీ భాగస్వామిని పోల్చొద్దు. దానివల్ల మీరు తనతో సంతోషంగా ఉండటం లేదని పొరపాటు పడే అవకాశం ఉంది. అందులోనుండే తనకు మీరు గౌరవం ఇవ్వట్లేదనే అభద్రత కూడా మొదలయ్యే ప్రమాదం ఉంది.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని