మీకు మేమున్నాం..
close
Updated : 18/04/2021 01:24 IST

మీకు మేమున్నాం..

గృహహింసతో బాధపడుతున్నారా?  అత్తమామలతో మానసిక వేధింపులున్నాయా? పనిప్రాంతంలో లైంగిక వేధింపులా? మీ సమస్య ఏదైనా సరే మాతో చెప్పండి. మేం పరిష్కరిస్తాం. అంటున్నారు జరియా సంస్థ నిర్వాహకులు. ఆ సంస్థ గురించి మరిన్ని విషయాలు పంచుకున్నారు నిర్వాహకురాలు సహర్‌ ఖాన్‌.

మా పూర్వీకులది భారతదేశమే! అమెరికాలో స్థిరపడ్డారు. నేను పుట్టి పెరిగింది అంతా బోస్టన్‌లోనే. కేంబ్రిడ్జిలో డెవలప్‌మెంట్‌ ఎకనమిక్స్‌లో మాస్టర్స్‌ చేశాను. ది హేగ్‌లో ఇంటర్నేషనల్‌ సిటీ ఆఫ్‌ పీస్‌ అండ్‌ జస్టిస్‌లో పనిచేశాను.
2012లో వేసవిలో ఇండియా వచ్చినప్పుడు అట్టడుగు వర్గాల స్త్రీల జీవితాల గురించి అధ్యయనం చేశాను. అందులో భాగంగా భారతదేశంలో ఉన్న కొన్ని ప్రాంతాల్లో(లఖ్‌నవూ, న్యూదిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌, ముంబయి) ఎన్‌జీవోలతో కలిసి మహిళల మీద జరుగుతున్న దాడుల మీద సర్వే నిర్వహించాను.
ముఖ్యంగా 16 నుంచి 44 ఏళ్ల వయసు వారు ఎక్కువగా ఎలాంటి సమస్యలతో చనిపోతున్నారో రిపోర్ట్‌ తయారు చేశాం. అందులో 70 శాతం మహిళలు గృహహింస వల్లనే చనిపోతున్నారని తేలింది. ఇలా దేశంలోని చాలా గ్రామాల్లో ఎంతోమంది మహిళలు హింసను ఎదుర్కొంటూనే ఉన్నారు. వాళ్లు బయటకి వచ్చి వారి సమస్యకు న్యాయం అడగలేరు. అడిగే అవకాశం కూడా ఉండకపోవచ్చు. ఉన్నా ఆర్థికంగా ఇబ్బంది పడొచ్చు. అలాంటి వారి కోసం ఏదైనా చేయాలనిపించింది. అదే ఆలోచనతో 2013లో కొంతమందితో కలిసి
zariyaindia.org అనే వెబ్‌సైట్‌ను నెలకొల్పాను. న్యాయం కోసం ఎవరూ ఎక్కడికీ వెళ్లనవసరం లేదు. ఈ వెబ్‌సైట్‌ తెరిస్తే చాలు. స్వచ్ఛందంగా న్యాయ సహాయం అందుతుంది. ఇందులో ప్రతి ఒక్క సమస్యకూ నిపుణులు పరిష్కారం చూపిస్తారు. వాళ్లే బాధితురాలికి న్యాయ సహాయం అందిస్తారు. వెబ్‌సైట్‌ తెరిచి ‘గెట్‌ హెల్ప్‌’ అనే ఆప్షన్‌ క్లిక్‌ చేస్తే వివరాలు అడుగుతుంది. అందులో ఫోన్‌ నంబర్‌, పిన్‌కోడ్‌ ఎంటర్‌ చేసి రిజిస్టర్‌ అయితే చాలు. అన్నట్టు బాధితురాలి వివరాలు గోప్యంగా ఉంచుతాము. కాబట్టి ఎలాంటి భయానికి లోనుకాకుండా ధైర్యంగా సమస్యను బయటపెట్టొచ్చు. గృహహింస, అత్యాచారం, యాసిడ్‌ హింస, లైంగిక వేధింపులు, ఆర్థిక దుర్వినియోగం, వరకట్న హింస, అత్తమామల వేధింపులు, కిడ్నాప్‌, అపహరణ, పనిప్రాంతంలో హింస, ఈవ్‌టీజింగ్‌ ఇలా సమస్య ఏదైనా సరే తెలియజేయొచ్చు. బాధితురాలు వివరాలు అందించిన 2 రోజుల్లో ఫోన్‌, ఎస్‌ఎంఎస్‌ లేదా ఈమెయిల్‌ ద్వారా సంబంధిత నిపుణులు ఆమెని సంప్రదిస్తారు. వారు ఆమెకి దగ్గరలోనే ఉంటే ప్రత్యక్షంగా కలుసుకుని సమస్యను పరిష్కరిస్తారు. లేదా వీలుని బట్టి ఫోన్‌లోనే మాట్లాడి పరిష్కారం చూపుతారు. ఉచితంగానే ఇదంతా.. ఇది పెట్టిన కొన్ని రోజుల్లోనే మంచి స్పందన వచ్చింది. ఇప్పటివరకూ వేలాదిమంది ఈ వెబ్‌సైట్‌ ద్వారా ఊరట పొందారు.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి