పాదాలు పదిలంగా..
close
Published : 19/04/2021 00:58 IST

పాదాలు పదిలంగా..

కాలంతో పనిలేకుండానే కొందరిని పాదాల పగుళ్లు వేధిస్తాయి. దీనికి కారణాలేవైనా... కాస్త శ్రద్ధపెడితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కోమలంగానూ ఉంటాయి.

* పగుళ్లు ఎక్కువగా ఉన్నప్పుడు రోజూ ఉదయం, సాయంత్రం రెండు టేబుల్‌ స్పూన్ల ఆముదంలో చెంచా తేనె కలిపి ఆ మిశ్రమాన్ని పాదాలకు రాసుకుని ఆరనివ్వాలి. ఆపై కాస్త పంచదారని తీసుకుని చేతుల్ని తడుపుకొంటూ పగిలిన మడమలకు రాసుకుని మర్దన చేయాలి.  
* కొందరి పాదాలు బిరుసుగా మారతాయి. ఇలాంటి వారు కొద్దిగా పెట్రోలియం జెల్లీలో చెంచా గులాబీ నూనె కలిపి  రాసుకోవాలి. ఇలా రోజూ చేస్తుంటే... మృదువుగా మారతాయి.
* పావుకప్పు నారింజ రసంలో, చెంచా తులసి పొడి, ఆముదం, కొద్దిగా కలబంద గుజ్జు కలిపి పాదాలకు రాసి రుద్దండి. ఇవి మృతకణాలను తొలగించి... మృదువుగా మారుస్తాయి.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని