అబద్ధానికి అడ్డుకట్ట వేయండి...
close
Published : 19/04/2021 01:01 IST

అబద్ధానికి అడ్డుకట్ట వేయండి...

ముద్దు ముద్దు మాటలతో మురిపించే చిన్నారులు... ఒక్కోసారి అలవోకగా అబద్ధాలు చెప్పేస్తుంటారు. అందుకు కొన్నిసార్లు కారణాలు ఉండకపోవచ్చు. ఇంకొన్నిసార్లు భయానికి, సరదాకో కూడా చెబుతూ ఉండి ఉండొచ్చు. అవి అలవాటుగా మారకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

భయాన్ని పోగొట్టండి: సాధారణంగా పిల్లలు చెప్పే అబద్ధాల్లో భయంతో చెప్పేవే ఎక్కువ ఉంటాయి. తాము చేసిన పొరపాటుని గుర్తిస్తే...తిడతారేమోననే ఆందోళనే ఇందుకు కారణం. వీలైనంతరవరకూ వారు చెప్పేది పూర్తిగా విన్నాకే నిర్ణయం తీసుకోండి. చేసిన తప్పును నిజాయతీగా ఒప్పుకొంటే దండించమనే భరోసా ఇవ్వాలి. అప్పుడే వారు నిజం చెప్పడానికి వెనుకాడరు.
సరదాకే చెబుతోంటే...: వారి తీరుని చిన్నప్పుడే సరిదిద్దాలి. లేదంటే...కొన్నిసార్లు అవి ప్రమాదాలకూ కారణం కావొచ్చు. ఏ సందర్భంలోనైనా భయపడకుండా నిజం చెబితే చిన్నచిన్న బహుమతులు ఇచ్చి ప్రోత్సహించాలి. ఇలా చేయడం వల్ల కొంతకాలానికి నిజం చెప్పడమే అలవాటుగా మారుతుంది. అంతేకాదు వారిలో ఆత్మవిశ్వాసమూ పెరుగుతుంది.
పెద్దలూ మారండి: చిన్నారులు ఎదురుగా కొందరు తల్లిదండ్రులు మాట మార్చడం, అబద్ధం చెప్పడం...అదే సరైనదని వాదించడం చేస్తుంటారు. దాన్ని పిల్లలూ అనుసరిస్తారు. అందుకు మీరే కారణం అవుతారు. ఈ పరిస్థితి రానివ్వకండి. ఎప్పుడైనా మాట తడబడితే...అది ఎవరికీ హానిచేయనిది, ఇంకొకరికి మేలు చేసేది అయితేనే చెప్పాల్సి వచ్చిందని నిజాయతీగా వారి ముందు ఒప్పుకోండి. వారు అర్థం చేసుకుంటారు. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుంటారు.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి