చొరవతో నేర్చుకోండి
close
Published : 20/04/2021 06:38 IST

చొరవతో నేర్చుకోండి

విద్య, ఉద్యోగ వాతావరణాల మధ్య చాలా తేడా ఉంటుంది. దాన్ని కొత్తగా ఉద్యోగంలో చేరినవారూ, చేరబోయేవారూ అర్థం చేసుకోవాలి. కొన్ని అంశాలపై అవగాహనా తెచ్చుకోవాలి. అప్పుడే కెరీర్‌లో ముందుకు వెళ్లగలరు. అవేంటంటే...

ద్యోగానికి అవసరమైన నైపుణ్యాల్ని చొరవ తీసుకుని నేర్చుకోవాలి. కళాశాలల్లోలా ఎవరో వచ్చి నేర్పించడమో, దగ్గరుండి చేయించడమో ఉండదు. సంస్థ కోరే ప్రధాన నైపుణ్యాల్లో ఈ లక్షణమూ ఒకటి. కీలక సమయాల్లో మీరు చురుగ్గా పని చేసే తీరు, చేసే సూచనలు మీకో ప్రత్యేకతను ఇస్తాయి.

* కొవిడ్‌ పరిస్థితినే గమనించండి. కొన్ని ఉద్యోగాలతోపాటు పరిశ్రమలూ కనుమరుగయ్యాయి. ఉద్యోగానికి అందుకున్న డిగ్రీ మాత్రమే సరిపోదనే విషయాన్ని ఇది స్పష్టం చేసింది. కాబట్టి, నిరంతరం నేర్చుకోవడానికి సిద్ధమవ్వాలి. పరిశ్రమ అవసరాలకు తగ్గట్టు నైపుణ్యాలను పెంచుకోవాలి.

* పనిచేసే చోట పక్క సీటు వారితో మాత్రమే సత్సంబంధాలు నెరిపితే సరిపోదు. ఇతర విభాగాల వారితోనూ పరిచయాలు ఉండాలి. వారి పనిపై అవగాహన తెచ్చుకోవాలి. ఇవన్నీ భవిష్యత్‌లో సాయపడతాయి.

* మెంటర్‌ను ఏర్పాటు చేసుకోండి. సీనియర్‌, పై అధికారి, తోటి ఉద్యోగి... ఎవరైనా అవొచ్చు. మీపై పూర్తి అవగాహనతో పాటు మీకంటే మెరుగైన పరిజ్ఞానాన్ని కలిగిన వారు అవ్వాలి. వారు ఎప్పటికప్పుడు మీ పనితీరును అంచనా వేయడంలోనూ, సరైన మార్గాన్ని సూచించడంలోనూ సాయపడతారు.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి