ఒత్తిడిని చిత్తు చేద్దాం..
close
Published : 20/04/2021 01:55 IST

ఒత్తిడిని చిత్తు చేద్దాం..

ఇంట్లో ఉదయాన్నే వంట, బాక్స్‌లు సిద్ధం చేయడం, ఆఫీసుకు రెడీ అవడం అబ్బబ్బా ఇన్ని పనులతో ఒత్తిడికి గురవుతున్నారా? అయితే ఇక నుంచి ఇలా చేయండి. సమయం ఆదా అవడమే కాదు. ప్రశాంతంగా మీ పనులూ పూర్తవుతాయి. అవేంటో చదివేయండి..

చాలామంది వంటగదిలో వస్తువుల్ని ఎలా పడితే అలా వదిలేస్తారు. గిన్నెలు, బాక్స్‌లు, వాటి మూతలూ ఒకదాని మీద మరొకటి పెట్టేయడంతో అవసరమైనప్పుడు అవి కనపడవు. ఫలితంగా సమయం వృథా అవుతుంది. అందుకే ఎప్పటికప్పుడు వస్తువుల్ని, కప్‌ బోర్డ్‌లోని పోపుల డబ్బాల్ని చక్కగా సర్దిపెట్టుకోవాలి.

* రేపు వేసుకోబోయే దుస్తుల్ని ముందుగానే ఇస్త్రీ చేసి పెట్టుకోవాలి. వాటిని పక్కకు తీసి ఉంచుకోవాలి. న్యాప్‌కిన్స్‌, చెప్పులు, షూస్‌, సాక్సులు, మాస్క్‌లు...అన్నింటినీ వాటితో పాటు సర్ది పెట్టుకుంటే సరి. ఉదయం చాలా సమయం ఆదా అవుతుంది. ఆఫీసు నుంచి ఇంటికి రాగానే బ్యాగ్‌, చెప్పులు, ఫోన్‌ చార్జర్‌ వంటివి రోజూ పెట్టే ప్రదేశంలోనే పెడితే వెతుక్కునే అవసరం ఉండదు.

* నిద్రకు ఉపక్రమించే ముందు ఉదయం చేసే పనుల్ని ప్లాన్‌ చేసుకోవాలి. లేవగానే ఏం కూరలు వండాలి? బ్రేక్‌ ఫాస్ట్‌ ఏం చేయాలి? వాటికి కావల్సిన పదార్థాలు ఉన్నాయో లేదో చెక్‌ చేసుకోవాలి. దానివల్ల సమయం ఆదా అవడంతో పాటు, ఒత్తిడి కూడా ఉండదు.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి