జుట్టుకి జిడ్డు తగ్గించే మార్గాలివి!
close
Published : 21/04/2021 00:22 IST

జుట్టుకి జిడ్డు తగ్గించే మార్గాలివి!

ఎండ రోజురోజుకీ పెరిగిపోతోంది. వేడి కొందరి జుట్టును జిడ్డుగా మారుస్తుంది. దీనికి కాలుష్యం, దుమ్మూ జతైతే మరిన్ని సమస్యలు. అందుకే అందుబాటులో ఉండే పదార్థాలతోనే పరిష్కరించుకోండి. అదెలాగంటే...
* కలబంద: కప్పు షాంపూలో ఒక టేబుల్‌ స్పూన్‌ కలబంద గుజ్జు, మూడు టేబుల్‌ స్పూన్ల నిమ్మరసం చేర్చి బాగా కలిపి తలకు పెట్టుకోవాలి. ఈ మిశ్రమంతో వారానికి రెండుసార్లు తలస్నానం చేయాలి.
* కలబంద:ముల్తానీ మట్టి: రెండు టేబుల్‌ స్పూన్ల ముల్తానీమట్టికి తగినంత నీరు కలిపి తలకు పట్టించాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. అవసరాన్నిబట్టి వారానికి ఒకటి, రెండుసార్లు ప్రయత్నించవచ్చు.
* కలబంద:బ్లాక్‌ టీ: ఒక టేబుల్‌ స్పూన్‌ బ్లాక్‌ టీని కప్పు నీటిలో మరిగించాలి. నీటిని వడకట్టి తలకు పట్టించాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. తలస్నానం చేసి ఆరిన జుట్టుకు దీనిని ప్రయత్నించాలి.
* కలబంద:నిమ్మరసం: అరకప్పు నిమ్మరసానికి కొంత నీరు చేర్చి దాన్ని నేరుగా తలకు పట్టించాలి. 10- 15 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేయాలి. నేరుగా షాంపూలో చేర్చి దానితో తలస్నానం చేసినా ఫలితం ఉంటుంది.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి