మేకప్‌లో మ్యాజిక్‌ కోసం...
close
Published : 22/04/2021 00:28 IST

మేకప్‌లో మ్యాజిక్‌ కోసం...

మేకప్‌ చేసుకునేటప్పుడు బ్లెండర్‌ స్పాంజెస్‌ ఉపయోగం అంతా ఇంతా కాదు. చర్మం పై రాసిన క్రీం, పౌడర్‌ను మృదువుగా సమంగా పరుచుకునేలా చేస్తాయివి. వీటిని మేకప్‌ తొలగించుకోవడానికీ వాడొచ్చు. కానీ వాడిన వెంటనే శుభ్రపరిచి కొంతసేపు గాలికి ఆరనివ్వాలి. లేదంటే సూక్ష్మజీవులు చేరి, తిరిగి వాడినప్పుడు చర్మానికి హాని కలిగిస్తాయి. ఈ స్పాంజెస్‌లో రకాలు వాటి ఉపయోగాలు ఇవీ...
కోడిగుడ్డు ఆకారంలో... ఇది సహజసిద్ధమైన బ్లెండర్‌ స్పాంజి. చెక్కిళ్లపైన, కంటి కింద, కంటి మూలల్లో వినియోగించడానికి సౌకర్యంగా ఉంటుంది.

ఫ్లాట్‌... ముఖం కింద, మెడపై భాగంలో దవడ అంచుల వద్ద ఈ స్పాంజిని వాడొచ్చు. అనువుగా ఉండని ప్రాంతాల్లో దీంతో తేలికగా ఫౌండేషన్‌ను సమం చేయొచ్చు.

టియర్‌ డ్రాప్‌... ముఖమంతా 360 డిగ్రీలు తిప్పడానికి సౌకర్యంగా ఉంటుంది. ముఖం నలుమూలలా క్రీంని ఒకేలా చేరుస్తుంది.
చీలినట్లుగా... ఇది చీలినట్లుగా ఉండి, ముఖంపై మేకప్‌ను తక్కువగా పీల్చుకుని ప్రభావవంతంగా పనిచేస్తుంది.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని