నడిచొచ్చే గ్రంథాలయం ఆమె!
close
Published : 22/04/2021 00:28 IST

నడిచొచ్చే గ్రంథాలయం ఆమె!

‘పుస్తకాలు చదువుతారా.. పిల్లలకు కామిక్‌ బుక్స్‌ కావాలా’ అంటూ... ఇంటింటికీ తిరుగుతూ నవలలు, పోటీపరీక్షల పుస్తకాలను అందజేసే అరవై నాలుగేళ్ల రాధామణిని వయనాడ్‌ చుట్టుపక్కలవారు ప్రేమగా.. ‘వాకింగ్‌ లైబ్రేరియన్‌’ అని పిలుస్తారు. ఈ వయసులోనూ ఆమె ఉత్సాహంగా రోజూ కిలోమీటర్ల కొద్దీ నడుస్తూ.. మహిళలు, వృద్ధులకు కావాల్సిన పుస్తకాలు, నవలలను అందిస్తున్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా ఆమె నడక కాస్త తగ్గినా... పుస్తక ప్రయాణం మాత్రం ఆపలేదు.
కొట్టాయంకు చెందిన రాధామణి 1979లో వాయనాడ్‌కి వచ్చారు. 2012 నుంచి ఆమె ఈ పనిని చేస్తూనే ఉన్నారు. మహిళల్లో చదివే అలవాటును అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ‘వనితా వయన పద్ధతి’ క్యాంపెయిన్‌ కింద కేరళ రాష్ట్ర విద్యాశాఖ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. సాధారణంగా స్థానిక గ్రంథాలయంలో ఏడాదికి 25 రూపాయలు లేదా నెలకు ఐదు రూపాయలు చొప్పున చెల్లించి సభ్యత్వం తీసుకోవచ్చు. ఒకవేళ అలా కూడా తీసుకోలేని వారి కోసం తనే పుస్తకాలను సేకరించి వారి ఇంటికే వెళ్లి ఇస్తోందామె. ‘రోజూ నా సంచిలో 20 నుంచి 25 మలయాళ పుస్తకాలను తీసుకువెళతా. ఇందులో చాలామటుకు నవలలు, పోటీపరీక్షల మెటీరియల్‌, చిన్నారులకిష్టమైన కథల పుస్తకాలు ఉంటాయి’ అని చెబుతారామె.

పదో తరగతి వరకు చదివిన ఆమెకు పుస్తక పఠనం అంటే చాలా ఇష్టం. కేవలం లైబ్రేరియన్‌గానే కాకుండా ప్లాస్టిక్‌ వ్యర్థాలను రీసైక్లింగ్‌ చేసే ప్రాజెక్ట్‌లోనూ చురుగ్గా పాలు పంచుకుంటారు. ఆమె భర్త పద్మనాభన్‌ నంబియన్‌ ఓ చిన్న కిరాణ కొట్టు నడుపుతారు. కొడుకు ఆటో డ్రైవరు. ‘ఇంట్లో ఉండే మహిళలకు పుస్తకాలను అందిస్తే వారు చదువుకుని ముందుకు వెళ్లగలుగుతారు. అలాగే నేనిలా ఇంటింటికీ తిరిగి పుస్తకాలను పంచడం వల్ల చాలామంది మహిళలకు లాభం చేకూరింది. చాలామంది వీటిని ఉపయోగించుకుని పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఎంతోమంది అమ్మాయిలు ఉద్యోగాలనూ తెచ్చుకున్నారు. ఈ విషయాలు నాకెంతో సంతోషాన్నీ,సంతృప్తినిస్తున్నాయి’ అంటారామె.

ఇంటి పనులతో తీరిక లేకుండా ఉండే గృహిణులకు పుస్తకాలు చదవడం అలవాటు చేయాలనేది ఆమె ఆలోచన. ఎందుకంటే ఇల్లాలు చదుకుంటేనే ఇంటికి వెలుగొస్తుందని ఆమె నమ్మకం.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి