కుర్చీ అనుకూలంగా!
close
Published : 22/04/2021 00:28 IST

కుర్చీ అనుకూలంగా!

పుస్తకాలు చదవడం వల్ల కేవలం జ్ఞానం మాత్రమే కాదు. మనసుకు ప్రశాంతత లభిస్తుంది. మనతో మనం గడిపామన్న సంగతి తెలుస్తుంది. అందుకు కూర్చునే చోటు కూడా అనువుగానూ, ఆహ్లాదంగానూ ఉండాలి. వీలైతే ఓ గది... లేదంటే గదిలోనే కొంత ప్రాంతాన్ని అందంగా ముస్తాబు చేసి చూడండి.
కుర్చీ అనుకూలంగా... కూర్చోవడానికి అనుగుణంగా ఉండే కుర్చీ వేసుకోవాలి. లేదంటే చదువుతున్నంతసేపూ అసౌకర్యానికి లోనవుతారు. అలాగే లేత రంగులో ఉండే కుర్చీని ఎంచుకోండి. స్ట్రెచింగ్‌ చైర్‌ అయితే మరీ మంచిది. మధ్యమధ్యలో కాస్త అటూ ఇటూ శరీరాన్ని కదిలించవచ్చు.
కిటికీ పక్కనే... కుదిరితే ఓ బల్ల, కుర్చీ ఉంటే అనువుగా ఉంటుంది. ఈ రెండూ కిటికీ పక్కనే ఉంటే మరింత బాగుంటుంది. నులివెచ్చని ఉషోదయాలు, చల్లచల్లని సాయంత్రాలు కిటికీ పక్కన కూర్చొని టీ తాగుతూ పుస్తకం చదువుతూ ఉంటే ఎంత బావుంటుందో కదా.. అయితే ఇక్కడ వేసుకునే కుర్చీ మృదువుగా, సౌకర్యంగా ఉండేలా చూసుకోండి.  
ఫుట్‌ స్టూల్‌... చదవడం మొదలుపెడితే గంటలు నిమిషాల్లా దొర్లిపోవడం ఖాయం. ఒకేచోట చాలాసేపు కూర్చొంటే కాళ్లకు వాపు వస్తుంది. అందుకే ఓ ఫుట్‌ స్టూల్‌ కూడా కావాలి. దీన్ని కుర్చీకి సరిపోయేలా చూసుకోండి.
సైడ్‌ టేబుల్‌... పుస్తకాలు, నీళ్లసీసా, టీ కప్పు... ఇలా వీటన్నింటినీ పెట్టుకోవడానికి సైడ్‌ టేబుల్‌ ఉండాలి. దాని మీద ఆకర్షణీయమైన పూలకుండీ లేదా ల్యాంప్‌ పెడితే అందం, సౌకర్యం. మీకు ఇష్టమైన ఆహార పదార్థాలనూ దాని మీద పెట్టుకోవచ్చు
ల్యాంప్‌... వెలుతురు ఉంటే చదవడం శ్రమ కలిగించదు. రాత్రి పూట కూడా చదువుకోడానికి వీలుగా అందమైన, ప్రకాశవంతమైన ల్యాంప్‌లను ఏర్పాటు చేసుకోవాలి.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి