వార్డ్‌రోబ్‌లో వదులైన దుస్తులుండాలి..
close
Published : 22/04/2021 00:28 IST

వార్డ్‌రోబ్‌లో వదులైన దుస్తులుండాలి..

టైట్‌ ఫిట్‌, ఒంటికి పట్టినట్లుండే చుడీదార్‌, పెన్సిల్‌ జీన్స్‌ వంటి దుస్తులకు ఈ వేసవిలో కొంత విరామం ఇస్తే మంచిది అని చెబుతున్నారు ఫ్యాషన్‌ నిపుణులు. వాటికి బదులు వదులుగా ఉండేవాటిని ఎంచుకుంటే అందమే కాదు, ఆరోగ్యమూ  అవేంటో చూద్దాం...
సౌకర్యంగా... వేసవి దుస్తులను ఎంచుకునేటప్పుడు అవి మనకు సౌకర్యంగా ఉన్నాయా లేదా అని కొనే ముందు గమనించుకోవాలి. శరీరాకృతికి తగ్గట్లుగా నడుము, భుజాల వద్ద సరైన కొలతలుంటే చాలు. మిగతా డ్రెస్‌ అంతా వదులుగా ఉన్నా చూడటానికి ఆకర్షణీయంగానే ఉంటుంది. పలాజో-వదులైన టాప్‌, పైజామా-వదులు జుబ్బా, తేలికైన కాటన్‌ టాప్‌, మోకాళ్ల కింద వరకు స్కర్టు బాగుంటాయి. ఏ దుస్తులు ధరించినా మనకు సౌకర్యంగా ఉంటే అవి మనకు నప్పినట్లే.
కొత్తగా... పొడవు గౌను ఫ్యాషన్‌ ఈ సీజన్‌లోనూ కొత్తగానే అనిపిస్తుంది. దీనికి మృదువైన వస్త్రాన్నే ఎంచుకోవాలి. చేతులు, నడుము కింద కొంత వదులుగా ఉన్నా చూడటానికి బాగుంటుంది. మోకాళ్ల వరకు వచ్చే కాటన్‌ గౌన్లు కూడా ఈ వేసవిలో బాగా నప్పుతాయి.
ఏదైనా ఓకే!... ఇప్పుడు అమ్మాయిలు ఫలానా డ్రెస్‌లే వేసుకోవాలనేదేమీ లేదు. ట్రెండ్‌ మారింది. వదులు జుబ్బాలు, కాటన్‌ చొక్కాలు, అలాగే వదులైన డెనిమ్‌ షర్ట్స్‌లను ధరించి కొత్తలుక్‌ను తెచ్చుకోవచ్చు. సమయం, సందర్భానికి తగినట్లుగా, శరీరాకృతికి నప్పేలా ఎంచుకుంటే చాలు. అప్పుడు మీరే ఓ కొత్త ఫ్యాషన్‌కు శ్రీకారం చుట్టినవాళ్లవుతారు.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి