పాఠంలాంటి... నెలసరి పాట!
close
Published : 24/04/2021 00:54 IST

పాఠంలాంటి... నెలసరి పాట!

వును మీరు చదివింది నిజమే. ఇది నెలసరి పాట. దేశంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన పాఠం లాంటి పాట. ఉయ్యాల వేడుక, పుట్టిన రోజు, రజస్వల, పెళ్లి, అప్పగింతలు, శ్రీమంతం, ప్రసవం, బాలింత స్నానం... ఆడపిల్ల జీవితంలో ప్రతి సందర్భానికీ పాట ఉంది. యుక్త వయసు తర్వాత ఆడపిల్ల అనుభవించే నెలసరి వేదనపై ఏ పాటా లేదు. ఆ సమయంలో అమ్మాయిలు అనుభవించే నరకయాతనను అందరికీ తెలియజేయడానికే ఈ ‘నెలసరి పాట’ పుట్టింది.  
నెలనెలా ఆగని రక్తధారలు, వాటితో అమ్మాయిలు పడే శారీరక, మానసిక క్షోభ ఈ పాటలో వినిపిస్తాయి. కనీసం ఆ ధారలను దాచలేని స్థితిలో పేద పిల్లలు... ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో నెలసరిలో ఏకాకిగా, అస్పృశ్యురాలిగా గడపాల్సిన వారి వేదన గుండెల్ని బరువెక్కిస్తుంది. ఈ పాట సృష్టికర్త హైదరాబాద్‌కు చెందిన సేవా సంస్థ ‘ప్యూర్‌’ (పీపుల్‌ ఫర్‌ అర్బన్‌ అండర్‌ రూరల్‌ ఎడ్యుకేషన్‌) స్థాపకురాలు శైలా తాళ్లూరి. 4 నిమిషాల 22 సెకన్ల నిడివి ఉన్న ఈ పాట అందరినీ చేరాలి అంటుందీమె. ‘ప్రతి ఒక్కరికీ నెలసరి గురించి తెలిసుండాలి. ఆ సమయంలో మహిళలు అనుభవించే శారీరక బాధ, మానసిక వేదన, ఒత్తిడి, కుంగుబాటు ఎలాంటివో అందరికీ తెలియాలి. ఇప్పటికీ దేశంలో చాలా ప్రాంతాల్లో కనీసం శానిటరీ ప్యాడ్స్‌ కూడా లేని పేదరికాన్ని తరిమికొట్టాలి. వీటిగురించి అవగాహన కల్పించేందుకు పాటే మంచి మార్గం అనుకున్నా. ఇప్పటికైనా సమాజంలో మార్పు రావాలి’ అని చెబుతారామె. ‘ప్యాడ్స్‌ ఆన్‌ వీల్స్‌’ పేరిట వందల గ్రామీణ పాఠశాలల్లో నెలసరిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు శైల. .

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి